లోక్‌సభలో రేపు వక్ఫ్‌ సవరణ బిల్లుపై చర్చ

లోక్‌సభలో రేపు వక్ఫ్‌ సవరణ బిల్లుపై చర్చ

Summarize with AI

వక్ఫ్‌ సవరణ బిల్లు (Waqf Amendment Bill) ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు (Kiren Rijiju) ఈ బిల్లును రేపు (బుధవారం) లోక్‌సభ (Lok Sabha)లో ప్రవేశపెట్టనున్నారు. మధ్యాహ్నం 12:15 గంటలకు ఈ బిల్లుపై లోక్‌సభలో చర్చ జరగనుంది. ఈ నేపథ్యంలో, బీజేపీ (BJP) అధిష్టానం తమ ఎంపీలందరికీ రేపటి ప్రత్యేక సమావేశానికి హాజరుకావాలంటూ విప్ జారీ చేసింది. అయితే, ప్రతిపక్ష పార్టీలు ఈ బిల్లుకు వ్యతిరేకంగా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి.

ఈ బిల్లుపై మొత్తం 8 గంటల పాటు చర్చ సాగనుంది. ఎన్డీఏ (NDA)కు చెందిన 298 మంది ఎంపీలు బిల్లుకు మద్దతు పలికే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీలంతా సభకు తప్పకుండా హాజరుకావాలని పార్టీ స్పష్టం చేసింది. కాంగ్రెస్ పార్టీ (Congress Party) కూడా ఎంపీల‌కు విప్ జారీ చేసింది. స‌భ‌కు క‌చ్చితంగా స‌భ్యులంతా హాజ‌రు కావాల‌ని కోరింది.

Join WhatsApp

Join Now

Leave a Comment