ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో మద్యం కుంభకోణం (Liquor Scam) కేసుపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టిపెట్టింది. కేసు విచారణను త్వరగా తేల్చేందుకు సిట్ (SIT) ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇవాళ ఈ కేసులో విచారణకు రావాల్సిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి (Vijayasai Reddy) గైర్హాజరు (Absence) అయ్యారు. మద్యం కేసులో విజయసాయిరెడ్డి పేరును కూడా చేర్చింది. కాగా, ఇవాళ సిట్ ముందుకు రావాల్సిన మాజీ ఎంపీ వివిధ కారణాల వల్ల విచారణకు హాజరుకాలేకపోతున్నానని పేర్కొంటూ విచారణాధికారులకు లేఖ (Letter) రాశారు. అయితే, త్వరలోనే ఎప్పుడు విచారణకు హాజరయ్యేది వెల్లడిస్తానని లేఖలో పేర్కొన్నారు. ఇప్పటికే ఈ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించగా, ఇప్పుడు విజయసాయి గైర్హాజరు కావడంతో రాజకీయంగా ఈ వ్యవహారం మరింత ఆసక్తికరంగా మారింది.
News Wire
-
01
CECకి జడ్ ప్లస్ కేటగిరీ భద్రత
చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్‌కుమార్ నివాసం వద్ద పటిష్ఠ బందోబస్తు. విపక్షాల ఆందోళనల నేపథ్యంలో జెడ్ ప్లస్ భద్రత కేటాయించిన కేంద్ర హోంశాఖ
-
02
ఏపీలో అతిపెద్ద ఓట్ చోరీ
ఏపీలో అతిపెద్ద ఓట్ చోరీ స్కాం జరిగిందని వైసీపీ నేత వాసుపల్లి గణేష్ ఆరోపణ. దొంగఓట్లతో కూటమి నాయకులు గెలిశారని మండిపాటు
-
03
విజయవాడలో మహిళ దారుణ హత్య
అరండల్ పేటలో ఘటన. మృతురాలు సునీతగా గుర్తింపు. సునీతను దారుణంగా కత్తితో పొడి హత్య చేసిన నిందితుడు నాగరాజు
-
04
ఇండియా కూటమి లంచ్ మీటింగ్
సాగర్ రత్న హోటల్ లో ఇండియా కూటమి ఎంపీల లంచ్ మీటింగ్. మరోసారి ఈసీ కార్యాలయం వరకు వెళ్లే యోచనలో కూటమి ఎంపీలు
-
05
ఈనెల 9న విచారణ
ఏపీలో బీసీ రిజర్వేషన్ పిటిషన్‌పై సుప్రీం కోర్టులో ఈనెల 9న విచారణ. ఏపీ హై కోర్టు తీర్పును సవాల్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
-
06
శ్రీసిటీలో ఘోర ప్రమాదం
తిరుపతి జిల్లా శ్రీసిటీలోని టిల్ హెల్త్ కేర్ పరిశ్రమలో పేలుడు. బాయిలర్ పేలడంతో నలుగురు మృతి.. మృతులు సంఖ్య పెరిగే అవకాశం
-
07
ఢిల్లీలో హైటెన్షన్
సీజేపీ ఆందోళనల నేపథ్యంలో 11 మెట్రో స్టేషన్ల మూసివేత. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని సీజేపీ డిమాండ్
-
08
గాంధీ విగ్రహానికి ఘోర అవమానం
శ్రీకాకుళం జిల్లాలో గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేసి చెత్తకుప్పల్లో వేసిన వైనం. విగ్రహాన్ని ధ్వంసం చేసిన మందుబాబులు
-
09
పడిపోయిన భారత స్టాక్ మార్కెట్లు
భారత స్టాక్ మార్కెట్లకు వరుసగా 8వ వారం నష్టాలు.. 25 ఏళ్లలో తొలిసారి.
-
10
హాకీలో పాకిస్థాన్‌పై భారత్ థ్రిల్లింగ్ విక్టరీ
సెమీఫైనల్లో భారత్ 4–3తో పాక్ ను ఓడించి ఫైనల్‌కు చేరింది. మ్యాచ్ ముగియడానికి 45 సెకన్ల ముందు అభిషేక్ గోల్ చేశాడు.








