సీఎం చంద్రబాబుకు వైసీపీ నేత లేఖ

సీఎం చంద్రబాబుకు వైసీపీ నేత లేఖ

Summarize with AI

వైసీపీ(YSRCP) నేత‌, మాజీ ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ (Vallabhaneni Vamsi) త‌న నియోజ‌క‌వ‌ర్గంపై ఫోక‌స్ పెంచారు. ఇటీవ‌ల గ‌న్న‌వ‌రంలో (Gannavaram) స‌మ‌స్య‌ల‌పై ముఖ్య‌మంత్రి లేఖ‌లు రాస్తూ వ‌స్తున్నారు. తాజాగా మ‌రో అంశంపై సీఎంకు వైసీపీ నేత లేఖ రాశారు. పోలవరం (Polavaram) కుడి ప్రధాన కాలువ పరివాహక ప్రాంత రైతుల సమస్యలపై (Farmers Issues) లేఖలో ప్ర‌స్తావించారు. కాలువ (Canal) నీటిని ఎత్తిపోసే వ్యవసాయ పంపుసెట్లకు విద్యుత్ సరఫరాను హఠాత్తుగా నిలిపివేయడంతో వేలాది మంది రైతులు, కౌలు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.

సీతారామపురం, మర్రిబంధం, రేమల్లె, వేలేరు, రంగన్నగూడెం, సింగన్నగూడెం, శోభనాద్రిపురం, బండారుగూడెం, బల్లిపర్రు, తెంపల్లి, గొల్లనపల్లి, బి.బి.గూడెం, పురుషోత్తపట్నం, గోపవరపుగూడెం, కొండపావులూరు, సూరంపల్లి, రామచంద్రపురం, నున్న, పాతపాడు, పి.నైనవరం గ్రామాల రైతులు(Farmers) ఈ కాలువపై (Canal) ఆధారపడుతున్నారని తెలిపారు.

2015లో అప్పటి ముఖ్యమంత్రిగా చంద్రబాబే (Chandrababu) కాలువ నీటిని (Canal Water) మోటార్ల ద్వారా ఎత్తిపోసుకునేందుకు అనుమతి ఇచ్చారని, గత 12 ఏళ్లుగా రైతులు ఇదే విధానంలో సాగు చేస్తున్నారని వంశీ పేర్కొన్నారు. అయితే ఖరీఫ్ సీజన్ (Kharif Season) మధ్యలో ఎలాంటి ముందస్తు నోటీసు లేకుండా విద్యుత్ కనెక్షన్లు (Electricity Connections) తొలగించడం రైతులకు తీవ్ర అన్యాయమని విమర్శించారు.

విద్యుత్ సరఫరాను వెంటనే పునరుద్ధరించాలని, కలెక్టర్ ఉత్తర్వులను నిలిపివేయాలని, రైతు ప్రతినిధులు–అధికారులతో ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేసి శాశ్వత విధానం రూపొందించాలని కోరారు. అలాగే ఇప్పటికే ఎండిపోయిన పంటలకు నష్టపరిహారం అందించాలని ముఖ్యమంత్రిని వంశీ విజ్ఞప్తి చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment