కూటమి ప్రభుత్వం (Alliance Government) అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని, ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి(Development, సంక్షేమ (Welfare) కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ‘ఇంటింటికీ టీడీపీ’ కార్యక్రమం (Intintiki TDP Campaign) ఆరంభంలోనే తీవ్ర నిరాశను మూటగట్టుకుంటోంది. మొత్తం 45 రోజుల పాటు ప్రతీ గడపనూ తొక్కాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) నిర్దేశించినప్పటికీ, క్షేత్రస్థాయిలో మాత్రం నాయకులు, కార్యకర్తల్లో కనీస ఉత్సాహం కనిపించడం లేదు.
ఈ నెల 27న ప్రారంభమైన ఈ 45 రోజుల సుదీర్ఘ కార్యక్రమం కేవలం రెండు రోజుల్లోనే తీవ్ర అసంతృప్తికి వేదికగా (Dissatisfaction Platform) మారింది. అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా క్షేత్రస్థాయి కార్యకర్తలకు, ద్వితీయ శ్రేణి నాయకులకు పనులు కాకపోవడం, తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతుండటంతో వారంతా ఈ ప్రచారంలో పాల్గొనేందుకు సుముఖత చూపడం లేదు.
నాయకులు కేవలం అధిష్టానం వద్ద మార్కులు వేయించుకోవడానికే తప్ప, మనస్ఫూర్తిగా ప్రచారంలో పాల్గొనడం లేదనే ప్రచారం జరుగుతోంది. టీడీపీ(TDP) అనుకూల మీడియా వర్గాల్లో సైతం ఈ కార్యక్రమానికి తగినంత ప్రాధాన్యత లభించకపోవడం, పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కనీసం టీడీపీ మీడియా ఛానళ్లలో (TDP Media Channels) అలాంటి వార్తా ప్రసారాలు కూడా లేకపోవడంతో ఇంటింటికీ ప్రచారం మూడవ రోజుకే మెత్తపడిందన్న సెటైర్లు వినిపిస్తున్నాయి.
మరోవైపు జనసేన(Jana Sena), బీజేపీలను(BJP) పక్కనబెట్టి, కేవలం టీడీపీ(TDP) పేరు మీద మాత్రమే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంపై ఆ పార్టీల శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వంలో కీలక భాగస్వాములుగా ఉన్న తమను సంప్రదించకుండా, కేవలం ఏకపక్ష నిర్ణయాలతో (One-Sided Decisions) ముందుకు వెళ్లడం భాగస్వామ్య పక్షాలను అవమానించడమే అంటూ వారు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు.
తెలుగుదేశం పార్టీ చేపట్టిన ఇంటింటికీ టీడీపీ కార్యక్రమాన్ని వేగవంతంగా, ఉత్సాహంగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు (CM Chandrababu Naidu), మంత్రి నారా లోకేష్(Nara Lokesh) కేడర్‌కు పిలుపునిచ్చినప్పటికీ, అది క్షేత్రస్థాయిలో ఏ విధంగా సాగుతుందో పర్యవేక్షించే తీరిక అధిష్టానానికి లేకపోవడం గమనార్హం.
ప్రారంభమైన రెండు రోజులకే పరిస్థితి ఇంత అధ్వానంగా ఉంటే, రానున్న 40 రోజులకు పైగా ఈ కార్యక్రమం ఏ విధంగా సాగుతుందోనని పార్టీ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. ఆ పార్టీ సోషల్ మీడియా ఖాతాల్లోనూ నిత్యం జగన్‌ను ఆడిపోసుకునే కార్యక్రమే జరుగుతోందని, టీడీపీ ఇంటింటి ప్రచారానికి పార్టీ సోషల్ మీడియా ఖాతాలు కూడా తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదంటూ విస్మయం వ్యక్తం చేస్తోంది ఆ పార్టీ క్యాడర్.







