వివేకా హత్య కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

వివేకా హత్య కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

Summarize with AI

వైఎస్ వివేకానంద రెడ్డి (YS Vivekananda Reddy) హత్య (Murder) కేసు(Case)లో నిందితుల బెయిల్ రద్దు పిటిషన్లపై సుప్రీంకోర్టు (Supreme Court) కీల‌క‌ వ్యాఖ్యలు చేసింది. నిందితుల‌ బెయిల్ రద్దు (Bail Cancellation)పై జోక్యం చేసుకోలేమని స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం స్పష్టం చేసింది. ఈ కేసులో తదుపరి దర్యాప్తు అంశంపై ట్రయల్ కోర్టు (Trial Court)ను ఆశ్రయించాలని పిటిషనర్లకు సూచించింది. ఈ కేసులో సీబీఐ(CBI) దర్యాప్తు ముగిసిందని కోర్టుకు తెలిపిన అడిషనల్ సొలిసిటర్ జనరల్ రాజు(Raju).. కోర్టు నిర్ణయిస్తే తదుపరి దర్యాప్తు చేస్తామని, అందుకు అనుమతి కావాలని సీబీఐ అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు.

తదుపరి దర్యాప్తు చేయాలన్న పిటిషనర్ వాదనపై జస్టిస్ (Justice) సుందరేష్ (Sundresh) ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ”మీరు బస్ మిస్సయ్యారు.. ఛార్జ్ షీట్ ఇప్పటికే దాఖలైంది. ఆ దశలోనే ఈ అంశాలు చెప్పాలి కదా.. దర్యాప్తు జరుగుతున్న సమయంలో ఈ అంశాలను ట్రయల్ కోర్టులో ఎందుకు చెప్పలేదు, ఇలాగే అప్లికేషన్స్ వేస్తూ వెళితే ట్రయల్ పూర్తి కావడానికి దశాబ్దం పడుతుంది ఈ దశలో మేము చేసేది ఏముంది..?” అని జస్టిస్ సుందరేష్ వ్యాఖ్యానించారు.

సుప్రీంకోర్టు ఆర్డర్

  • నిందితుల బెయిల్ రద్దుపై ఎలాంటి జోక్యం ఉండదు.
  • తదుపరి దర్యాప్తుపై ట్రయల్ కోర్టును ఆశ్రయించాలి.
  • ఎనిమిది వారాల్లో ట్రయల్ కోర్టు ఈ పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాలని ఆశిస్తున్నాం.. అని కోర్టు పేర్కొంది.

సీబీఐ తరఫు వాదనలో.. “తదుపరి దర్యాప్తు అవసరం లేదని భావిస్తున్నాం. కానీ కోర్టు అనుమతిస్తే చేయడానికి సిద్ధంగా ఉన్నాం” అని సీబీఐ పేర్కొంది. మొత్తంగా, వివేకా హత్య కేసులో నిందితుల బెయిల్ రద్దు అంశాన్ని సుప్రీంకోర్టు తిరస్కరించగా, తదుపరి దర్యాప్తు విషయాన్ని ట్రయల్ కోర్టుకు మళ్లించింది.

Join WhatsApp

Join Now

Leave a Comment