పోలవరం (Polavaram) జిల్లా రంపచోడవరం (Rampachodavaram) మండలం ఇర్లపల్లి కొత్తకాలనీలో విషాద ఘటన చోటుచేసుకుంది. స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో(ZP High School) పదో తరగతి చదువుతున్న ముర్రం శివాని (Murram Shivani) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఇంటి సమీపంలోని రేకుల షెడ్లో ఆమె మృతదేహాన్ని గుర్తించినట్లు సమాచారం. ఘటనపై పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఈ నెల 24న జరిగిన మెగా పేరెంట్-టీచర్ మీటింగ్‌లో (Mega Parent-Teacher Meeting) శివాని పాల్గొంది. ఆ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) పక్కన కూర్చొని ఆయనతో మాట్లాడిన విద్యార్థిని.. రెండు రోజుల వ్యవధిలోనే మృతి చెందడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
సూసైడ్ నోట్లో తల్లిదండ్రుల ప్రస్తావన
ఘటనా స్థలంలో శివాని రాసినట్లుగా భావిస్తున్న సూసైడ్ నోట్ (Suicide Note) లభించినట్లు సమాచారం. అందులో తల్లిదండ్రులపై తనకున్న ప్రేమను పలుమార్లు ప్రస్తావించినట్లు తెలుస్తోంది. “డాడీ.. మీ డ్రీమ్‌ను నెరవేర్చలేకపోతున్నా” అంటూ ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. తల్లిదండ్రులు తనపై పెట్టుకున్న ఆశలను నెరవేర్చలేకపోతున్నందుకు క్షమించాలని కోరినట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యులందరూ ఎప్పటికైనా కలిసుండాలనేది తన కోరికగా నోట్లో పేర్కొంది.
శివాని మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఆమె ఈ నిర్ణయం తీసుకోవడానికి దారితీసిన పరిస్థితులు ఏమిటి? వ్యక్తిగత లేదా చదువుకు సంబంధించిన ఒత్తిళ్లు ఏమైనా ఉన్నాయా? అనే అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల దర్యాప్తు పూర్తయిన తర్వాతే శివాని మృతికి సంబంధించిన పూర్తి కారణాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.









ముదురుతున్న వివాదం.. బోండా ఉమ వర్సెస్ టీడీపీ!