పేపర్ లీక్‌లపై ప్రధాని మోదీ ట్వీట్.. మంత్రి ప్రస్తావన ఏదీ?

పేపర్ లీక్‌లపై ప్రధాని మోదీ ట్వీట్.. మంత్రి ప్రస్తావన ఏదీ?

Summarize with AI

ఢిల్లీలో (Delhi) కాక్రోచ్ జ‌న‌తా పార్టీ (Cockroach Janata Party) మొద‌లుపెట్టిన ఉద్య‌మం దేశవ్యాప్తంగా అంటుకుంది. యువ‌త(Youth) స్వ‌చ్ఛందంగా త‌ర‌లివ‌చ్చి పెద్ద పెట్టున ఉద్యమించారు. ఢిల్లీలో జ‌రిగిన అల‌జ‌డి దేశ యువ‌త‌ను ఆలోచింప‌జేసింది. కేంద్ర ప్ర‌భుత్వంపై (Central Government) వ్య‌తిరేక‌త పెరుగుతున్న నేప‌థ్యంలో.. పేపర్ లీకేజీలపై ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) ఎక్స్ వేదిక‌గా స్పందించారు. పేపర్ లీకేజీలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించేందుకు ప్రత్యేకంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులను (Fast Track Courts) ఏర్పాటు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు.

“దేశ యువత సంక్షేమం, వారి భవిష్యత్తు కంటే మాకు ఏదీ ముఖ్యం కాదు. పేపర్ లీకేజీలకు పాల్పడే వారికి త్వరితగతిన, కఠినమైన శిక్షలు పడేలా చూడటానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టులను (Fast Track Courts) ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. దీనికి సంబంధించి తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించాను. విద్యార్థుల ప్రయోజనాలను కాపాడేందుకు మేము తీసుకుంటున్న వరుస చర్యల్లో ఇది ఒక భాగం. యువత భవిష్యత్తుతో ఆడుకోవాలని చూసే వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టేది లేదు” అని మోదీ ట్వీట్ చేశారు.

పేపర్ లీకేజీల బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి (Education Minister) రాజీనామా (Resignation) చేయాలని, పరీక్షల రద్దు వల్ల మానసిక ఒత్తిడికి గురై ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల కుటుంబాలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని విపక్షాలు, విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రధాని తన ప్రకటనలో విద్యాశాఖ మంత్రి ప్రస్తావన గానీ, విద్యార్థుల ఆత్మహత్యల అంశంపై గానీ ఎలాంటి వివరణ ఇవ్వలేదని విమర్శిస్తున్నాయి. మరొకవైపు, విద్యార్థుల భవిష్యత్తును రక్షించేందుకే ప్రభుత్వం పబ్లిక్ ఎగ్జామినేషన్స్ చట్టంతో పాటు ఫాస్ట్ ట్రాక్ కోర్టుల వంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటోందని కేంద్ర వర్గాలు వెల్లడించాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment