టి20 ప్రపంచకప్ 2026 (T20 World Cup 2026)టోర్నమెంట్‌లో టీమిండియా (Team India) అద్భుత ప్రదర్శనతో విశ్వ విజేతగా నిలిచింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం (Narendra Modi Stadium) వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై (New Zealand) భారత్ 96 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో టీమిండియా మూడోసారి టీ20 ప్రపంచకప్‌ను కైవసం చేసుకుని అభిమానులను ఆనందంలో ముంచెత్తింది. ఫైనల్ మ్యాచ్‌లో సంజూ శాంసన్ 89 పరుగులతో అద్భుతంగా రాణించి జట్టును విజయతీరాలకు చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు. అతని అద్భుత ప్రదర్శనకు గాను ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును ప్రకటించింది.
అయితే ఈ నిర్ణయంపై పాకిస్తాన్ (Pakistan) ఓపెనర్ సాహిబ్‌జాదా ఫర్హాన్ (Sahibzada Farhan) సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు (Player of the Series Award) తనకే రావాల్సిందని, దాన్ని సంజూ శాంసన్‌కు ఇవ్వడం సరైంది కాదని ఫర్హాన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఐసీసీ నిర్ణయంపై (ICC Decision) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన అతడు అవసరమైతే ఈ విషయంపై కోర్టును ఆశ్రయిస్తానని కూడా వ్యాఖ్యానించాడు. ఫర్హాన్ వ్యాఖ్యలు ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.









ఇకపై ‘దొరసాని’ని చూస్తారు – కవితపై బీజేపీ ఎంపీ సెటైర్లు