పాక్ బౌలర్ ఉస్మాన్ తారిక్‌ ఫైర్‌

పాక్ బౌలర్ ఉస్మాన్ తారిక్‌ ఫైర్‌

Summarize with AI

టీ20 ప్రపంచకప్‌ 2026 (T20 World Cup 2026)లో భాగంగా భారత్ (India), పాకిస్థాన్ (Pakistan) మధ్య ఫిబ్రవరి 15న మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. కొలొంబోలో ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌కు సంబంధించి తాజాగా ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. మ్యాచ్ ముగిసిన తర్వాత మైదానం వెలుపల భద్రత విషయంలో వివక్ష చూపించారంటూ పాక్ బౌలర్ ఉస్మాన్ తారిక్ (Usman Tariq) సంచలన ఆరోపణలు చేశాడు. శ్రీలంక పోలీసులు భారత ఆటగాళ్ల పట్ల సానుకూలంగా ఉంటూ.. తమ పట్ల కఠినంగా వ్యవహరించారని అసహనం వ్యక్తం చేశాడు.

ఉస్మాన్ తారిక్ మాట్లాడుతూ… ‘మేము భారత్ చేతిలో ఓడిపోయినందుకు బాధపడటం లేదు. గెలుపు, ఓటములు ఆటలో భాగం. కానీ మా ఆటగాళ్లతో పాటు జట్టు సిబ్బంది అందరి బ్యాగులను శ్రీలంక పోలీసులు రెండు సార్లు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అదే సమయంలో భారత ఆటగాళ్ల బ్యాగులను మాత్రం కనీసం చెక్ చేయకుండానే పంపించేశారు. మాపై ఈ విధమైన పక్షపాతం ఎందుకు చూపుతున్నారు?’ అని ప్రశ్నించాడు. అంతర్జాతీయ టోర్నీల్లో ఆటగాళ్లందరికీ సమానమైన భద్రతా నిబంధనలు ఉండాలని, కానీ శ్రీలంకలో మాత్రం పాక్ ఆటగాళ్లను ఇబ్బంది పెడుతున్నారని తారిక్ ఆరోపించారు.

హోటల్ నుంచి స్టేడియానికి వచ్చే సమయంలోనూ, తిరిగి వెళ్లే సమయంలోనూ తనిఖీల పేరుతో పాకిస్థాన్ ఆటగాళ్లను ఎక్కువ సమయం వేచి ఉండేలా చేస్తున్నారని ఉస్మాన్ తారిక్ నిరాశ వ్యక్తం చేశాడు. పాకిస్తాన్ ప్లేయర్లు ఏమైనా ఉగ్రవాదులు లాగా కనిపిస్తున్నారా? అంటూ నిలదీశాడు. భారత ఆటగాళ్లకు ఓ రూల్, పాక్ ప్లేయర్లకు మరో రూలా? అంటూ లంక పోలీసులపై తారిక్ ఫైర్ అయ్యాడు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొందరు క్రికెట్ అభిమానులు భద్రత విషయంలో రాజీ పడకూడదని అంటుండగా, మరికొందరు ఒకే టోర్నీలో రెండు జట్ల మధ్య ఇలాంటి వ్యత్యాసం ఉండటం సరైంది కాదని అభిప్రాయపడుతున్నారు. తారిక్ వ్యాఖ్యలపై ఐసీసీ లేదా శ్రీలంక క్రికెట్ బోర్డు ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.

Join WhatsApp

Join Now

Leave a Comment