కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి, వైఎసీపీ సీనియర్ నాయకుడు ముద్రగడ పద్మనాభం భౌతిక కాయానికి మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నివాళులర్పించారు. కిర్లంపూడిలో జరిగిన అంతిమయాత్రలో పాల్గొని ముద్రగడకు తుది వీడ్కోలు పలికారు.
ముద్రగడ పద్మనాభం పార్థివదేహానికి పుష్పాంజలి ఘటించిన వైఎస్ జగన్, ఆయన సతీమణి, కుమారుడు ముద్రగడ గిరిబాబును పరామర్శించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ధైర్యంగా ఉండాలని ఓదార్చారు.
ముద్రగడ పద్మనాభం అంతిమ సంస్కార కార్యక్రమం పూర్తయ్యే వరకు వైఎస్ జగన్ అక్కడే ఉండి అన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అంతిమయాత్రలో ముద్రగడ పాడెను స్వయంగా మోసి ఆయన పట్ల ఉన్న గౌరవాన్ని, అనుబంధాన్ని చాటుకున్నారు.
ముద్రగడ మరణం కాపు ఉద్యమానికి, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు తీరని లోటని పలువురు నాయకులు పేర్కొంటుండగా, అంతిమయాత్రకు పెద్ద సంఖ్యలో ప్రజలు, అభిమానులు, పార్టీ నేతలు హాజరై ఆయనకు కన్నీటి వీడ్కోలు పలికారు.
ముద్రగడ పాడె మోస్తున్న వైఎస్ జగన్
— Telugu Feed (@Telugufeedsite) July 15, 2026
కిర్లంపూడిలో కాపు ఉద్యమ నేత, వైసీపీ సీనియర్ నాయకుడు ముద్రగడ అంత్యక్రియల్లో పాల్గొన్న మాజీ సీఎం వైఎస్ జగన్ pic.twitter.com/liOul040rW








