హైదరాబాద్‌లోని (Hyderabad) అమీర్‌పేట్ (Ameerpet) ప్రాంతంలో గురువారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుని తీవ్ర కలకలం రేపింది. మైత్రివనం (Mythrivanam) ఎదురుగా ఉన్న కేఎస్‌ఆర్ ఫ్యాషన్స్ (KSR Fashions) భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. భవనం పై అంతస్తుల నుంచి ఎగిసిపడిన అగ్నికీలలు (Fire Flames) వేగంగా వ్యాపించడంతో సమీపంలోని పలు దుకాణాలకు కూడా మంటలు అంటుకున్నాయి. దట్టమైన పొగ ఆ ప్రాంతమంతా వ్యాపించడంతో వ్యాపారులు తమ దుకాణాలను ఖాళీ చేసి బయటకు పరుగులు తీశారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది పలువురు ఫైర్ ఇంజిన్లతో (Fire Engines) ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రమాద తీవ్రతను దృష్టిలో ఉంచుకుని పోలీసులు కూడా సహాయక చర్యల్లో పాల్గొని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరిగిందా లేదా అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. దీంతో అమీర్‌పేట్ – ఎస్ఆర్ నగర్ (Ameerpet–SR Nagar) మద్య భారీ ట్రాఫిక్ జామ్ అయ్యింది. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియరాకపోయినా, మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చిన అనంతరం అధికారులు దర్యాప్తు చేపట్టనున్నట్లు సమాచారం.










