కాంగ్రెస్‌లో కిరికిరి.. కొండా మురళి సంచలన వ్యాఖ్యలు

కాంగ్రెస్‌లో కిరికిరి.. కొండా మురళి సంచలన వ్యాఖ్యలు

Summarize with AI

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మ‌రింత‌గా ముదిరి ర‌చ్చ‌కెక్క‌తున్నాయి. మాజీ ఎమ్మెల్సీ, మంత్రి కొండా సురేఖ భ‌ర్త‌ కొండా మురళీధర్ గాంధీ భవన్‌లోని క్రమశిక్షణ కమిటీ ముందు హాజ‌రైన అనంత‌రం సంచలన వ్యాఖ్యలు చేశారు. కడియం శ్రీహరి పార్టీలోకి ప్రవేశించినప్పటి నుంచి సమస్యలు మొదలయ్యాయని, ఆయన మంత్రులు కొండా సురేఖ, సీతక్క మధ్య గ్యాప్ ఉందని తప్పుడు ప్రచారం చేశారని కొండా మురళి ఆరోపించారు. అలాగే “పరకాల నియోజకవర్గం పూర్తిగా మాదే” అని పేర్కొంటూ, రేవూరి ప్రకాశ్ రెడ్డి తమ మద్దతుతోనే గెలిచారని, కానీ ఇప్పుడు గుడుపూటానీ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.

కొండా మురళి తన వ్యాఖ్యలలో నాయిని రాజేందర్ రెడ్డిపై కూడా తీవ్ర ఆరోపణలు చేశారు. “నాయిని పెద్ద సెటిల్మెంట్‌లు చేస్తున్నారు, మా నియోజకవర్గంతో సంబంధం లేకుండా పోస్టులు ఇప్పించుకుంటున్నారు” అని ఆయన అన్నారు. అదనంగా, కడియం శ్రీహరి స్టేషన్ ఘనపూర్‌లో ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అవకతవకలకు పాల్పడుతూ, ఇందిర అనుచరులను టార్చర్ చేస్తున్నారని ఆరోపించారు. వేం నరేందర్ రెడ్డి తన సీటు కోల్పోవడానికి తానే కారణమని కోపంగా ఉన్నట్లు కనిపిస్తున్నారని కూడా పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు వరంగల్ జిల్లా కాంగ్రెస్ నాయకత్వంలో ఉన్న ఉద్రిక్తతలను మరింత బహిర్గతం చేశాయి. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు పార్టీ ఐక్యతను దెబ్బతీసే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

తన రాజకీయ నేపథ్యాన్ని సమర్థించుకుంటూ, కొండా మురళి “నేను కాంగ్రెస్‌లోకి రాజీనామా చేసి, 26 మంది కార్పొరేటర్లతో చేరాను. కొందరిలా పార్టీ మారి పదవులు ఆనందించడం నాకు ఇష్టం లేదు. నేను ఇండియాలో ఏకగ్రీవంగా ఎన్నికైన ఎమ్మెల్సీని” అని చెప్పుకొచ్చారు.

కొండా ముర‌ళీ రాహుల్ గాంధీ జన్మదిన వేడుకల సందర్భంగా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై వరంగల్ ఎమ్మెల్యేల నుంచి తీవ్ర విమర్శలు వ్య‌క్తం అయ్యాయి. ఈ వివాదం ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ దృష్టికి వెళ్లడంతో, క్రమశిక్షణ కమిటీ విచారణకు ఆదేశించింది. ఈ సమావేశంలో ఎంపీ మల్లు రవి ఆధ్వర్యంలో కొండా మురళి వివరణ ఇచ్చినప్పటికీ, ఈ వివాదం పార్టీలో ఐక్యతను దెబ్బతీసే అవకాశం ఉందని, రాబోయే ఎన్నికలపై ప్రభావం చూపవచ్చని నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment