ఏపీలో బస్సు బీభత్సం.. నలుగురు మృతి

ఏపీలో బస్సు బీభత్సం.. నలుగురు మృతి

Summarize with AI

కర్ణాటక గంగావతి డిపోకు చెందిన కేఎస్‌ఆర్టీసీ బస్సు బీభ‌త్సం సృష్టించింది. గంగావతి నుంచి రాయచూర్‌కు వెళ్తున్న ఈ బస్సు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ఆదోని మండలం పాండవగళ్లు గ్రామ సమీపంలో ముందుగా వెళ్తున్న రెండు ద్విచక్ర వాహనాలపై అదుపుతప్పి దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు వ్య‌క్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడడంతో ఆయన పరిస్థితి విషమంగా ఉంది.

మృతుల వివరాలు
ఈ దుర్ఘటనలో ఆదోని మండలం కుప్పగళ్లు గ్రామానికి చెందిన భార్యా భర్తలు, కర్ణాటక మాన్వికి చెందిన అక్కా తమ్ముళ్లు మృతి చెందారు. గాయపడిన మరో వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. దర్యాప్తు కొనసాగుతోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment