శ్రీలంకను చిత్తు చేసిన భారత్.. అక్టోబర్ 3న పాక్‌తో ఫైనల్ సమరం!

శ్రీలంకను చిత్తు చేసిన భారత్.. అక్టోబర్ 3న పాక్‌తో ఫైనల్ సమరం!

Summarize with AI

మంగళవారం జరిగిన ఏకపక్ష రెండో సెమీఫైనల్లో టీమిండియా అద్భుత ప్రదర్శనతో శ్రీలంకను (Sri Lanka) 124 పరుగుల భారీ తేడాతో చిత్తు చేసి ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్(India) 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ (Ishan Kishan) 80 పరుగులతో నాటౌట్‌గా నిలిచి భారత ఇన్నింగ్స్‌కు వెన్నెముకగా నిలిచాడు. 170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకకు భారత బౌలర్లు ఆరంభం నుంచే చుక్కలు చూపించారు. తొలి ఓవర్‌లోనే ఒక్క పరుగు కూడా చేయకుండానే రెండు వికెట్లు కోల్పోయిన లంక.. ఆ తర్వాత ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. చివరికి 9.5 ఓవర్లలో కేవలం 45 పరుగులకే ఆలౌటైంది. జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah), అక్షర్ పటేల్ (Axar Patel) చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. ముగ్గురు శ్రీలంక బ్యాటర్లు రనౌట్ అయ్యారు. ఇక అభిషేక్ శర్మ(Abhishek Sharma) వరుసగా రెండు బంతుల్లో చివరి రెండు వికెట్లు తీసి లంక ఇన్నింగ్స్‌కు తెరదించాడు.

అంతకుముందు జరిగిన తొలి సెమీఫైనల్లో పాకిస్థాన్ (Pakistan) 6 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడించి ఫైనల్‌లో అడుగుపెట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 7 వికెట్ల నష్టానికి 111 పరుగులు మాత్రమే చేయగా.. సాహిబ్‌జాదా ఫర్హాన్ నేతృత్వంలోని పాకిస్థాన్ మరో 9 బంతులు మిగిలి ఉండగానే 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. గత ఏషియన్ గేమ్స్‌లో పతకం సాధించడంలో విఫలమైన పాకిస్థాన్.. ఈసారి ఫైనల్ చేరడంతో కనీసం రజతం లేదా స్వర్ణం సాధించే అవకాశం దక్కించుకుంది. దీంతో అక్టోబర్ 3న జరగనున్న భారత్-పాకిస్థాన్ ఫైనల్‌పై (India-Pakistan Final) సర్వత్రా ఆసక్తి నెలకొంది. రెండు జట్లు టైటిల్ కోసం తలపడనున్న నేపథ్యంలో ఈ మహాసంగ్రామం అభిమానులకు అసలైన క్రికెట్ విందును అందించనుంది.

Join WhatsApp

Join Now

Leave a Comment