హైదరాబాద్ సిటీ పోలీస్ పరిధిలో భారీ పునర్వ్యవస్థీకరణ

హైదరాబాద్ సిటీ పోలీస్ పరిధిలో భారీ పునర్వ్యవస్థీకరణ

Summarize with AI

హైదరాబాద్ మహానగరంలో(Hyderabad Metropolitan City) శాంతిభద్రతల (Law and Order) పరిరక్షణ, పోలీసు వ్యవస్థను (Police System) మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హోంశాఖ జారీ చేసిన G.O.Ms.No.84 ద్వారా హైదరాబాద్ సిటీ పోలీస్ పరిధిలోని పలు జోన్లు, డివిజన్లు, పోలీస్ స్టేషన్ల సరిహద్దులను పునర్వ్యవస్థీకరించింది. నగర విస్తరణ, పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పోలీసు పరిపాలనను సులభతరం చేయడంతో పాటు శాంతిభద్రతల పర్యవేక్షణను మరింత సమర్థవంతంగా చేపట్టే లక్ష్యంతో ఈ మార్పులు చేశారు. మొత్తం 76 ప్రాంతాలకు సంబంధించి పోలీసు పరిధుల్లో మార్పులు చేపట్టగా, సికింద్రాబాద్ మార్కెట్(Secunderabad Market), మల్కాజిగిరి, మహేశ్వరం, శంషాబాద్, సైబరాబాద్ తదితర ప్రాంతాల్లో పలు సరిహద్దులు మారాయి. శంషాబాద్ డివిజన్‌లోని RGIA పోలీస్ స్టేషన్ పేరును ‘శంషాబాద్ పోలీస్ స్టేషన్’గా(Shamshabad Police Station) మార్చారు.

ఇదే సమయంలో రాజేంద్రనగర్, అబ్దుల్లాపూర్‌మెట్, మీర్‌పేట్‌తో పాటు జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, సనత్‌నగర్ వంటి ముఖ్యమైన ప్రాంతాల పోలీసు పరిధుల్లోనూ పునర్విభజన జరిగింది. లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్లతో పాటు ట్రాఫిక్, ఉమెన్ సేఫ్టీ, జోనల్ సైబర్ సెల్ విభాగాల పరిధులను కూడా ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించింది. మహిళల భద్రతను (Women’s Safety) మరింత బలోపేతం చేయడం, ట్రాఫిక్ నిర్వహణను మెరుగుపరచడం, పెరుగుతున్న సైబర్ నేరాలపై వేగంగా స్పందించడం వంటి లక్ష్యాలతో కొత్త పరిధులను ఖరారు చేసింది. తాజా పునర్వ్యవస్థీకరణతో పోలీసు సిబ్బంది తమ పరిధిలోని ప్రాంతాలపై మరింత సమర్థవంతంగా పర్యవేక్షణ చేయడంతో పాటు ప్రజలకు పోలీసు సేవలు వేగంగా అందే అవకాశం ఉంది.

Join WhatsApp

Join Now

Leave a Comment