సాయికృష్ణ కేసులో ఊహించని ట్విస్ట్.. తల్లికి తెలియకుండానే పిటిషన్

సాయికృష్ణ కేసులో ఊహించని ట్విస్ట్.. తల్లికి తెలియకుండానే పిటిషన్

Summarize with AI

రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన విజయవాడ (Vijayawada) యువకుడు గాదె సాయి కృష్ణ (Gade Sai Krishna) లాకప్ డెత్ (Lockup Death) వ్యవహారంలో రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. తన కుమారుడి కేసులో సీబీఐ (CBI) దర్యాప్తు కోరుతూ వేసిన పిటిషన్‌ను (Petition) తనకు తెలియకుండా ఉపసంహరించుకున్నారంటూ సాయికృష్ణ తల్లి(Mother) విజయలక్ష్మి (Vijayalakshmi) దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ధర్మాసనం (AP High Court Bench) సంచలన విచారణ చేపట్టింది.

తనకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా, తన ప్రమేయం లేకుండానే సీబీఐ విచారణ (CBI Investigation), హెబియస్ కార్పస్ పిటిషన్‌ను (Habeas Corpus Petition) ఉపసంహరించుకుంటున్నట్లు న్యాయవాది కొగంటి రిత్విక (Koganti Rithvika) పిటిషన్ దాఖలు చేశారని సాయికృష్ణ త‌ల్లి విజయలక్ష్మి ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు.

దీనిపై స్పందించిన గౌర‌వ హైకోర్టు ధర్మాసనం.. విజయలక్ష్మిని నేరుగా ప్రశ్నిస్తూ “మీకు ఏ న్యాయవాది కావాలి?” అని అడిగింది. దీంతో నిన్నటివరకు ఎవరిపై అయితే ఆరోపణలు వచ్చాయో, ఆ న్యాయవాది రిత్వికనే తిరిగి తన తరఫున వాదించడానికి కోరుకుంటున్నట్లు సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి ధర్మాసనానికి తెలపడంతో కోర్టు హాలులో (Court Hall) ఒక్కసారిగా అంద‌రూ షాక్‌కు గురైన‌ట్టు స‌మాచారం.

ఈ సందర్భంగా హెబియస్ కార్పస్ పిటిషన్‌పై తుది వాదనలను వినిపించడానికి సిద్ధంగా ఉన్నారా అని హైకోర్టు ప్ర‌భుత్వ త‌ర‌ఫు న్యాయ‌వాదిని ప్రశ్నించింది. ప్రస్తుతం కేసు విచారణ వివిధ దశల్లో వేగంగా జరుగుతోందని, ఈ వ్యవహారంపై సమగ్ర వివరాలు సమర్పించడానికి తమకు రెండు వారాల సమయం కావాలని ప్రభుత్వం తరఫున హాజరైన న్యాయవాది ధర్మాసనాన్ని కోరారు. రెండు వారాల సుదీర్ఘ గడువు ఇవ్వడానికి ధర్మాసనం నిరాకరించింది. తదుపరి విచారణను 10 రోజులకు వాయిదా వేసింది.

  • కీల‌క ప్ర‌శ్న‌లు ఇవే..
  • పిటిషనర్ ముందస్తు అనుమతి లేకుండా సీబీఐ(CBI) దర్యాప్తు ఉపసంహరణ పిటిషన్ ఎలా దాఖలైంది?
  • న్యాయవాది మార్పు, ఉపసంహరణల వెనుక ఏమైనా ఒత్తిళ్లు పనిచేస్తున్నాయా?
  • రాబోయే 10 రోజుల్లో ప్రభుత్వం సమర్పించబోయే విచారణ నివేదికలో ఎలాంటి అంశాలు వెలుగుచూడబోతున్నాయి?

ఈ కేసు మొదట్నుంచీ తీవ్ర వివాదాస్పదంగా మారగా, తాజా పరిణామాలతో హైకోర్టు ఇచ్చే తీర్పుపై రాష్ట్రవ్యాప్తంగా సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Join WhatsApp

Join Now

Leave a Comment