ఏపీ మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని హఠాన్మరణం

ఏపీ మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని హఠాన్మరణం

Summarize with AI

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విషాదం చోటుచేసుకుంది. రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (ఆళ్ల నాని) కన్నుమూశారు. విశాఖలోని నివాసంలో గుండెపోటుతో ఆళ్ల నాని మృతిచెందారు. ఆయన ఆకస్మిక మృతి పట్ల ఏపీ రాజకీయ వర్గాలు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నాయి.

ఆళ్ల నాని తన రాజకీయ జీవితాన్ని కాంగ్రెస్ పార్టీ ద్వారా ప్రారంభించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఏలూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ త‌రువాత వైసీపీలో చేరి కీల‌క నేత‌గా ఎదిగారు. రాష్ట్ర విభజన తర్వాత ఆళ్ల నాని వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి వెంట నడిచారు. 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించిన తర్వాత వైఎస్ జగన్ కేబినెట్‌లో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రితో పాటు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తించారు.

2024 ఎన్నిక‌ల్లో వైసీపీ ఓట‌మి చెందిన త‌రువాత వైసీపీని వీడిన ఆయన, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగు దేశం పార్టీలో చేరారు. అప్పటి నుంచి ఏలూరు రాజకీయాల్లో టీడీపీ నాయ‌కుడిగా కొనసాగుతున్నారు.

ఏలూరుతో విడదీయరాని బంధం
ఏలూరు నియోజకవర్గం నుంచి ఆయన మూడు సార్లు ఎమ్మెల్యేగా ఆళ్ల నాని గెలుపొందారు. ఆయన మృతి పట్ల ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు, మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి, పలువురు రాజకీయ ప్రముఖులు ప్రగాఢ సంతాపం తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని ప్రకటించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment