రిటైర్డ్ ఉద్యోగి ఫైల్ రెడీ చేసేందుకు లంచం!

రిటైర్డ్ ఉద్యోగి ఫైల్ రెడీ చేసేందుకు లంచం!

Summarize with AI

రిటైర్డ్ ఉద్యోగి (Retired Employee) ఫైల్ సిద్ధం చేసేందుకు ఆమె ప‌నిచేసిన శాఖ‌ కార్యాలయ సిబ్బందే డబ్బులు (Money) డిమాండ్ చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది. కామారెడ్డి జిల్లా (Kamareddy District)ఇరిగేషన్ శాఖ Irrigation) కార్యాలయంలో అవినీతి ఆరోపణలు (Corruption Allegations) కలకలం రేపుతున్నాయి. త‌న‌కు రావాల్సిన ఫైన‌ల్ సెటిల్‌మెంట్ (Final Settlement) కోసం ఫైల్ సిద్ధం చేసేందుకు సూపరింటెండెంట్, జూనియర్ అసిస్టెంట్‌కు రూ.5 వేల చొప్పున మొత్తం రూ.10 వేలు ఇచ్చినప్పటికీ ఇప్పటివరకు తన పని పూర్తి చేయలేదని రిటైర్డ్ ఉద్యోగి జ్యోతి (Jyothi) ఆగ్రహం వ్యక్తం చేశారు.

తన ఫైల్‌ను(File) సిద్ధం చేయకపోవడంతో పాటు అధికారుల నిర్లక్ష్యం కారణంగా పెన్షన్ (Pension) కూడా రావడం లేదని జ్యోతి ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో కుటుంబ సభ్యులతో కలిసి కామారెడ్డి జిల్లా ఇరిగేషన్ శాఖ కార్యాలయానికి చేరుకుని ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా ఇరిగేషన్ శాఖ సూపరింటెండెంట్ భీమరాజుతో(Bheemaraju) జ్యోతి వాగ్వాదానికి దిగారు.

ఈ వ్యవహారంలో జూనియర్ అసిస్టెంట్ నాగరాజు(Nagaraju) కార్యాలయంలో అందుబాటులో లేకపోవడంతో ఆయనకు ఫోన్ చేసి నిలదీశారు. డబ్బులు (Money) తీసుకున్నప్పటికీ తన ఫైల్ ఎందుకు సిద్ధం చేయలేదని ప్రశ్నించారు. చాలా కాలంగా పని కోసం కార్యాలయం చుట్టూ తిరుగుతున్నానని, తన సమస్యను పరిష్కరించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నానని తెలిపారు.

అధికారుల నిర్లక్ష్యం వల్లే తన పెన్షన్ ప్రక్రియ పూర్తికాక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని జ్యోతి వాపోయారు. ఇప్పటికే లోన్లు ఉండటంతో కుటుంబ పోషణ కూడా కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు స్పందించి వెంటనే తన ఫైల్ సిద్ధం చేసి పెన్షన్ సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.

ఉద్యోగులు(Employees), రిటైర్డ్ ఉద్యోగులకు(Retired Employees) సంబంధించిన పనులు చేసేందుకు డబ్బులు డిమాండ్ చేస్తున్నారన్న ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి, ఆరోపణలు నిజమైతే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment