30 రోజులు జైలులో ఉంటే పదవి పోతుందా?.. పార్లమెంట్‌లోకి కొత్త బిల్లు!

30 రోజులు జైలులో ఉంటే పదవి పోతుందా?.. పార్లమెంట్‌లోకి కొత్త బిల్లు!

దేశ రాజకీయాల్లో (Country Politics) కీలక మార్పులకు దారితీసే అవకాశమున్న రాజ్యాంగ సవరణ బిల్లుపై (Constitution Amendment Bill) చర్చ మొదలైంది. రాబోయే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో 130వ రాజ్యాంగ సవరణ బిల్లును (130th Constitutional Amendment Bill) కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.

ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు సహా ప్రజా ప్రతినిధులు ఏదైనా కేసులో 30 రోజుల (30 Days) కంటే ఎక్కువకాలం జైలులో(Jail) ఉంటే, వారి పదవులు ఆటోమేటిక్‌గా రద్దయ్యేలా నిబంధనలు తీసుకురావాలని ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ బిల్లు పార్లమెంట్ ఉమ్మడి పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)(JPC) పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. వర్షాకాల సమావేశాల ప్రారంభంలోనే జేపీసీ తన నివేదికను పార్లమెంట్‌కు సమర్పించే అవకాశం ఉందని తెలుస్తోంది.

జేపీసీ నివేదికను పరిశీలించిన అనంతరం కేంద్ర ప్రభుత్వం (Central Government) బిల్లును పార్లమెంట్ (Parliament) ముందుకు తీసుకురావచ్చని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే ఇది రాజ్యాంగ సవరణ బిల్లు కావడంతో, దీనికి లోక్‌సభ(Lok Sabha),, రాజ్యసభల్లో (Rajya Sabha) మూడింట రెండు వంతుల మెజారిటీతో ఆమోదం లభించాల్సి ఉంటుంది. అవసరమైతే రాష్ట్రాల ఆమోదం కూడా అవసరం కావచ్చు.

ఈ బిల్లు చట్టంగా మారితే ప్రజా ప్రతినిధుల అర్హతలు, పదవీకాలానికి సంబంధించిన నిబంధనల్లో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని న్యాయ, రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అయితే ప్రస్తుతం ఈ బిల్లు ఇంకా చట్టంగా మారలేదు. జేపీసీ నివేదిక, పార్లమెంట్‌లో చర్చ, ఆమోదం వంటి ప్రక్రియలు పూర్తయిన తర్వాతే దీనిపై తుది నిర్ణయం వెలువడనుంది.

Join WhatsApp

Join Now

Leave a Comment