చెప్పుతో కొట్టుకొని.. ఛీ అంటున్న‌ టీడీపీ కార్య‌క‌ర్త‌లు

చెప్పుతో కొట్టుకొని.. ఛీ అంటున్న‌ టీడీపీ కార్య‌క‌ర్త‌లు

రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) ప్ర‌భుత్వ (Government) ప‌రిపాల‌న‌పై సొంత పార్టీ నాయ‌కులే పెద‌వి విరుస్తున్నారు. వారి ఆక్రోశాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినా.. వారు ఆశించిన న్యాయం(Justice), గౌర‌వం (Respect) ద‌క్క‌క‌పోవ‌డంతో గెలిపించి త‌ప్పు చేశామ‌ని చెప్పుతో కొట్టుకునే ప‌రిస్థితులు దాపురించాయి. ఇలా బ‌య‌ట‌ప‌డింది ఇద్ద‌రు ముగ్గురే అయినా, బ‌య‌ట‌ప‌డ‌ని బాధితులు చాలామందే ఉన్నార‌నే చ‌ర్చ జ‌రుగుతోంది.

ఇటీవ‌ల ప్ర‌కాశం జిల్లాలో ఏళ్ల తరబడి టీడీపీలో(TDP) ఉన్నా విలువలేదని అస‌హ‌నం వ్య‌క్తం చేస్తూ టీడీపీ నేత సోమేపల్లి శ్రీనివాసరావు(Somepalli Srinivasa Rao).. చెప్పులు అరిగేలా తిరిగినా న్యాయం జరగలేదని చెప్పుతో కొట్టుకొని, చివరకు విసుగు చెంది ఆ పార్టీకి రాజీనామా (Resignation) చేస్తున్నట్లు ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే..

తాజాగా.. అనంతపురం జిల్లా శింగనమల టీడీపీలో తీవ్ర అసంతృప్తి, అంతర్గత విభేదాలు ఒక్కసారిగా రోడ్డున పడ్డాయి. తన సొంత పార్టీ ఎమ్మెల్యే బండారు శ్రావణిని (Bandaru Sravani) గెలిపించినందుకు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ, ఒక టీడీపీ(TDP) నేత బహిరంగంగా చెప్పుతో కొట్టుకున్న దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. గార్లదిన్నె మండలం కనుంపల్లి గ్రామానికి చెందిన ప్రముఖ టీడీపీ నేత కనుంపల్లి ప్రసాద్ (Kanumpalli Prasad) ఈ వినూత్న నిరసనకు దిగారు.

ఇటీవల అనంతపురం జిల్లాలో మంత్రి నారా లోకేష్(Nara Lokesh) పర్యటించారు. ఈ సందర్భంగా జిల్లాకు వచ్చిన లోకేష్‌ను కలిసి నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలను వివరించాలని కనుంపల్లి ప్రసాద్ భావించారు. అయితే, ఆయన మంత్రిని కలవకుండా ఎమ్మెల్యే బండారు శ్రావణి ముందస్తుగా పోలీసులను పంపి తనను ‘హౌస్ అరెస్ట్'(House Arrest) చేయించారని ప్రసాద్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ సెల్ఫీ వీడియో విడుద‌ల చేశాడు.

మా ఇంట్లో మేము ఉంటే ఎమ్మెల్యే శ్రావ‌ణి సొంత పార్టీ నాయ‌కులను పోలీసులతో అక్రమంగా అరెస్ట్ చేయిస్తున్నారని, మేమేమైనా నక్సలైట్లమా? ఉగ్రవాదులమా? రౌడీషీటర్లమా? లేక రేపిస్టులమా? మాపై పోలీసులు గానీ, ఎమ్మెల్యే బండారు శ్రావణి ఎందుకు వివక్ష సాధింపుల‌కు దిగుతున్నార‌ని ప్ర‌శ్నించాడు.

ఎమ్మెల్యే శ్రావణి తీరుపై ఆగ్రహంతో ఊగిపోయిన ప్రసాద్, తన చెప్పు తీసుకుని తనను తానే కొట్టుకుంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. “ఒకటే చెప్తున్నా.. నియోజకవర్గ ప్రజలకు మీరు ఎమ్మెల్యేగా పనికిరారు. మిమ్మల్ని మేము గెలిపించుకున్నందుకు మా చెప్పు తీసుకుని ఒకటి కాదు పదిసార్లు మమ్మల్ని కొట్టుకున్నా తప్పులేదు. మా పాపం ఊరికే పోదు అని నియోజకవర్గ ప్రజలందరికీ చెప్తున్నా” అని టీడీపీ(TDP) కార్య‌క‌ర్త ప్ర‌సాద్ చెప్పారు.

సొంత పార్టీ ఎమ్మెల్యేలు, అగ్ర‌నాయ‌క‌త్వం తీరుపై అస‌హ‌నం వ్య‌క్తం చేస్తూ టీడీపీ కార్య‌క‌ర్త‌లు చెప్పుల‌తో త‌మ‌ను తాము దండించుకోవ‌డం పార్టీలోని ప‌రిస్థితుల‌ను బ‌య‌ట‌పెడుతోంది. పార్టీ కోసం ప‌నిచేసిన వారిని నేత‌లు, ఎమ్మెల్యేలు విస్మ‌రిస్తున్నార‌నే బ‌హిర్గ‌తం అవుతోంది. ప్రస్తుతం ఈ ఘటన అనంతపురం జిల్లా రాజకీయాల్లోనే కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణుల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది.

Join WhatsApp

Join Now

Leave a Comment