ఖమ్మం (Khammam) జిల్లాలోని సత్తుపల్లిలో (Sathupalli) సంచలనం సృష్టించిన డెకాయిట్ కేసును (Dacoity Case) పోలీసులు(Police) ఛేదించారు. పోలీసుల వేషధారణలో వ్యాపారవేత్తను (Businessman) బెదిరించి రూ.40 లక్షలు దోచుకున్న ముఠాను గుర్తించిన ప్రత్యేక బృందం.. మాస్టర్‌మైండ్‌తో పాటు మొత్తం 12 మందిని అరెస్ట్ చేసింది. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.
పోలీసుల వివరాల ప్రకారం.. ఈ కేసులో మాస్టర్‌మైండ్‌తో (Mastermind) పాటు ఓ పోలీస్ కానిస్టేబుల్ (Police Constable), ఓ రిజర్వ్ సబ్‌ఇన్‌స్పెక్టర్ (ఆర్‌ఎస్‌ఐ) (Reserve Sub Inspector – RSI) కూడా ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. నిందితులు పోలీస్ యూనిఫామ్‌లు ధరించి అధికారుల మాదిరిగా వ్యవహరిస్తూ వ్యాపారవేత్తను బెదిరించి రూ.40 లక్షలు దోచుకున్నట్లు పోలీసులు తెలిపారు.
ఈ కేసును ఛేదించేందుకు కల్లూరు ఏసీపీ(ACP) ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం ఏర్పాటు చేశారు. హైదరాబాద్ (Hyderabad) నుంచి ఖమ్మం (Khammam) వరకు విస్తృతంగా ఆపరేషన్ నిర్వహించి నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
నిందితుల వద్ద నుంచి రూ.17.60 లక్షల నగదు స్వాధీనం చేసుకున్న పోలీసులు.. రెండు ఇన్నోవా కార్లు, ఒక ఎర్టిగా కారు, ఒక టీవీఎస్ యాక్సెస్ స్కూటీని (TVS Access Scooter) కూడా స్వాధీనం చేసుకున్నారు. అదనంగా 16 సెల్‌ఫోన్లు, పోలీస్ యూనిఫామ్‌లు, హ్యాండ్‌కఫ్‌లు, నకిలీ రూ.500 నోట్ల కట్టలను సీజ్ చేసినట్లు తెలిపారు.
ఈ కేసులో ఇంకా ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలింపు కొనసాగుతోందని పోలీసులు పేర్కొన్నారు. డెకాయిట్ గ్యాంగ్ వెనుక ఉన్న పూర్తి కుట్ర, ఇతర నిందితుల పాత్ర, స్వాధీనం చేసుకున్న నకిలీ కరెన్సీకి సంబంధించిన అంశాలపై దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించారు.








