హైదరాబాద్ అభివృద్ధిపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

హైదరాబాద్ అభివృద్ధిపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

Summarize with AI

హైదరాబాద్ నగర అభివృద్ధి పనులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక సమీక్ష నిర్వహించారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ)లో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో జీహెచ్‌ఎంసీ, మల్కాజిగిరి, సైబరాబాద్ కమిషనరేట్‌ల పరిధిలో కొనసాగుతున్న ప్రాజెక్టుల పురోగతిని అధికారులతో సవివరంగా పరిశీలించారు. అభివృద్ధి పనుల్లో జాప్యానికి తావులేకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసిన సీఎం, భూసేకరణ ప్రక్రియ పూర్తికాకుండా ఎలాంటి అభివృద్ధి పనులకు టెండర్లు పిలవొద్దని కఠిన ఆదేశాలు జారీ చేశారు. భూసేకరణను వేగవంతం చేసేందుకు ప్రత్యేక అధికారిని ఇప్పటికే నియమించినట్లు వెల్లడించడంతో పాటు, వివిధ శాఖల మధ్య సమన్వయం పెంచి ప్రాజెక్టులకు అనుమతులు త్వరగా మంజూరు అయ్యేలా ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని సూచించారు.

సమీక్ష సందర్భంగా సైబరాబాద్‌లో ఏర్పాటు చేయనున్న మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ విగ్రహం, దానికి సంబంధించిన జంక్షన్ అభివృద్ధి పనులను హెచ్‌ఎండీఏ తక్షణమే వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు. అలాగే నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్‌మెంట్ (NIUM) నూతన భవనం, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయ భవన నమూనాలను పరిశీలించిన ఆయన, నిర్మాణ నాణ్యత, ప్రజా సౌకర్యాలపై అధికారులకు కీలక సూచనలు చేశారు. నగరంలో చేపడుతున్న అన్ని అభివృద్ధి పనులు నిర్దేశిత గడువులో పూర్తై ప్రజలకు త్వరగా అందుబాటులోకి రావాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ కార్యదర్శి శ్రీదేవి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ కర్ణన్, హైడ్రా కమిషనర్ రంగనాథ్, జలమండలి ఎండీ అశోక్ రెడ్డి సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment