రాష్ట్రంలో ఇంధన సంక్షోభం.. ప్రజల ఇక్కట్లకు కారణం ఎవరు?

రాష్ట్రంలో ఇంధన సంక్షోభం.. ప్రజల ఇక్కట్లకు కారణం ఎవరు?

Summarize with AI

రాష్ట్రంలో వారం రోజులుగా మండుటెండల్లో రోడ్లమీద నరకయాతన.. పెట్రోలు బంకుల (Petrol Bunks) వద్ద గంటల తరబడి పడిగాపులు.. సాధారణ ప్రజలు, రైతులు(Farmers), ఉద్యోగులు(Employees), వ్యాపా­రుల దీనావస్థ, ఇక్కట్లకు కర్త, కర్మ, క్రియ చంద్రబాబు సర్కారేనని (Chandrababu Government) రుజువైంది. ప్రజల కళ్లకు గంతలు కట్టి సర్కారే దొంగాట ఆడు­తున్నట్లు తేలిపోయింది! దోచుకో.. పంచుకో.. తినుకో..! విధానంతో బరి తెగించి అడ్డగోలుగా వ్యవహరి­స్తున్న టీడీపీ(TDP) పెద్దలు ప్రజ­లు ఏమైపోతే తమకేమంటూ జనం జీవితాలతో చెలగాట­మాడేందుకు వెనుకాడటం లేదు.

రాష్ట్రంలో ఇంధన కొరతపై (Fuel Shortage) సమీక్షించిన సీఎం చంద్రబాబు చమురు కంపెనీలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని.. విరుచుకుపడ్డారని ఎల్లో మీడియా, సీఎంవో(CMO) ఇచ్చిన లీ­కులు ఉత్తుత్తివేనని తేలిపోయింది. స్వయంగా కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగి జోక్యం చేసుకోవడంతో చంద్రబాబు బడాయిల బండారం బట్టబయలైంది.

వాణిజ్య అవసరాల కోసం వినియోగించే కమర్షియల్, బల్క్‌ డీజిల్‌ను సాధారణ ప్రజల కోసం ఏర్పాటైన రిటైల్‌ పెట్రోలు బంకులలో రాజధాని నిర్మాణ పనుల (Capital Construction Works) కాంట్రాక్టు సంస్థలకు తక్కువ ధరకు విక్రయించాలని చమురు కంపెనీలను ఆదేశిస్తూ బాబు ప్రభుత్వం సర్క్యులర్‌ జారీ చేయటాన్ని కేంద్రం తప్పుబట్టింది. ఇది చట్ట విరుద్ధమని, ఆ ఉత్తర్వులు చెల్లవని, వెంటనే ఉప­సంహరించుకో­వాలని ఆదేశించిది. ఈ మేరకు కేంద్ర పెట్రో­లియం శాఖ కార్యదర్శి తాజాగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్య­దర్శికి లేఖ రాసింది.

వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ (YS Jagan) ఆదేశాల మేరకు ఢిల్లీలో పెట్రోలియం శాఖ ఉన్నతాధి­కారుల­ను కలసిన కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి (YS Avinash Reddy) ఏపీలో వారం రోజు­లుగా ప్రజల దుస్థితిని వివరించడంతో అసలు సంగతి వెలుగులోకి వచ్చింది. సాధారణ ప్రజల కోసం సరఫరా చేయాల్సిన డీజిల్‌ను బాబు సర్కారు ఏపీలో కొందరు కాంట్రాక్టర్లకు ప్రయోజనం కల్పి­స్తూ వాణిజ్య అవసరాల కోసం దారి మళ్లించినట్లు బహిర్గతమైంది.

Join WhatsApp

Join Now

Leave a Comment