ప్రముఖ నటుడు, దర్శకుడు చిట్టిబాబు కన్నుమూత!

ప్రముఖ నటుడు, దర్శకుడు చిట్టిబాబు కన్నుమూత!

Summarize with AI

తెలుగు సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు, దర్శకుడు, నిర్మాత, అనలిస్ట్ మరియు బీజేపీ నేత త్రిపురనేని చిట్టిబాబు (71) బుధవారం అర్ధరాత్రి కన్నుమూశారు. గత రాత్రి ఛాతిలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆయనను హైటెక్ సిటీలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మరణ వార్తతో టాలీవుడ్ వర్గాలు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాయి.

1955లో కృష్ణా జిల్లాలో జన్మించిన చిట్టిబాబు అసలు పేరు వరప్రసాద్. ప్రముఖ రచయిత త్రిపురనేని మహారథి కుమారుడైన ఆయన చెన్నైలో విద్యాభ్యాసం పూర్తి చేసి, అప్పలాచార్య, ఆత్రేయ వంటి దిగ్గజాల వద్ద శిష్యరికం చేశారు. మోహన్ బాబు ప్రోత్సాహంతో ‘సంతానం’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన ఆయన సుమారు 12 సినిమాలకు దర్శకత్వం వహించారు. నటుడిగా కూడా గుర్తింపు పొందిన చిట్టిబాబు ‘రాఖీ’ సినిమాలోని నెగిటివ్ పాత్రతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. మొత్తం 30కి పైగా సినిమాల్లో నటించి, అనేక చిత్రాలకు కో-డైరెక్టర్‌గా పనిచేసి తెలుగు చిత్రసీమలో తనదైన ముద్ర వేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment