సీసీ కెమెరాల‌తో పంట న‌ష్టాన్ని గుర్తిస్తారా..?

సీసీ కెమెరాల‌తో పంట న‌ష్టాన్ని గుర్తిస్తారా..?

Summarize with AI

అర్నబ్ తుపాను (Arnab Cyclone) బీభత్సానికి రాష్ట్రంలో లక్షలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిని, రైతాంగం తీవ్ర నష్టాల్లో కూరుకుపోతే… బాధితులకు అండగా నిలవాల్సిన చంద్రబాబు ప్రభుత్వం (Chandrababu Government) పబ్లిసిటీ స్టంట్లు(Publicity Stunts), కంటితుడుపు చర్యలకే పరిమితమైందని వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

పార్టీ జిల్లా అధ్యక్షులు, రీజనల్ కో-ఆర్డినేటర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో(Video Conference) ఆయన మాట్లాడారు. గ్రామ/వార్డు సచివాలయాల వ్యవస్థను(Village and Ward Secretariat System) నిర్వీర్యం చేయడం, వాలంటీర్ వ్యవస్థను(Volunteer System) రద్దు చేయడం వల్ల తుపాను సహాయక చర్యలు దారుణంగా విఫలమయ్యాయని, విపత్తును కూడా అధికార పార్టీ నాయకులు ఆదాయ వనరుగా మార్చుకుంటున్నారని మండిపడ్డారు.

సామాన్యుడిపై(Common People) బియ్యం ధ‌ర(Rice Prices) భారం దారుణంగా పెరిగింది. సోనా మసూరి బియ్యం కేజీ రూ.90 దాటినా ప్రభుత్వంలో చలనం లేదన్నారు. ఆర్థిక మంత్రి పయ్యావుల వియ్యంకుడు(Finance Minister Payyavula Keshav), టీడీపీ ఎమ్మెల్యే జోగేశ్వర్రావుతో పాటు (TDP MLA Jogeshwara Rao) అధికార పార్టీ నేతలు బియ్యాన్ని మార్కెట్లోకి రానివ్వకుండా బ్లాక్‌ చేసి, ఎక్స్‌పోర్ట్ చేస్తూ నిలువునా దోచుకుంటున్నారని, చినబాబు (లోకేష్)(Lokesh), నాదెండ్ల మనోహర్‌లకు(Nadendla Manohar) కమీషన్లు చేరుతున్నాయని ఆరోపించారు.

తుపాను కారణంగా రాష్ట్రంలో దాదాపు 12 లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని జగన్ తెలిపారు. ఉమ్మడి కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి, కాకినాడ, అనకాపల్లి, కృష్ణా జిల్లాల్లో వరి పంటలు పూర్తిగా నేలమట్టమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.

సీసీ కెమెరాలతో(CCTV Cameras), ఆర్టీజీఎస్‌ (RTGS) గదుల్లో కూర్చుంటే పంట నష్టం తెలుస్తుందా? చంద్రబాబు డ్రోన్లు(Drones), సీసీ కెమెరాలంటూ కాకిలెక్కలు చెప్తూ కాలయాపన చేస్తున్నారని మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మండిప‌డ్డారు. వరి రైతు ఎకరాకు రూ.40 వేల వరకు నష్టపోతున్నారు. అరటి రైతుకు ఎకరాకు రూ.2 లక్షల వరకు నష్టం వాటిల్లింది. విద్యుత్ సరఫరా Power Supply)నిలిచిపోయి, జనరేటర్లపై ఆధారపడి ఎకరాకు రూ.4 నుంచి 5 లక్షల నష్టాన్ని చవిచూస్తున్నారని తెలిపారు.

తుపాను విపత్తులో ఇప్పటివరకు 8 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని, ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతుల కుటుంబాలకు ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా సాయం చేయడంలేదని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్లాల్లో ఉన్న ధాన్యం (Paddy Grain) తడిసిపోకుండా, రంగు మారిన ధాన్యాన్ని సైతం మద్దతు ధరకు ప్రభుత్వం కొనుగోలు చేసేలా వైయస్ఆర్సీపీ నేతలు క్షేత్రస్థాయిలో పోరాడాలని, బాధిత రైతులకు పూర్తి స్థాయిలో అండగా నిలవాలని పిలుపునిచ్చారు.

Join WhatsApp

Join Now

Leave a Comment