“ఆదర్శ కుటుంబం” మూవీ రివ్యూ: త్రివిక్రమ్-వెంకీ కాంబో వర్కౌట్ అయిందా?

"ఆదర్శ కుటుంబం" మూవీ రివ్యూ: త్రివిక్రమ్-వెంకీ కాంబో వర్కౌట్ అయిందా?

Summarize with AI

నటీనటులు: వెంకటేష్, శ్రీనిధి శెట్టి, నారా రోహిత్, నివేదా పేతురాజ్, సత్య, బ్రహ్మాజీ, రావు రమేష్ తదితరులు
దర్శకత్వం: త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌
నిర్మాత: ఎస్‌. రాధాకృష్ణ (చినబాబు)
సంగీతం: ఎస్. థమన్స్
సినిమాటోగ్రఫీ: రవి కె. చంద్రన్‌
విడుదల తేదీ: అక్టోబర్ 30, 2026

విక్టరీ వెంకటేష్ ఫ్యామిలీ ఇమేజ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సృష్టించే మ్యాజిక్‌ కలసి వస్తే ఆ కిక్కే వేరు. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘ఆదర్శ కుటుంబం’ (AK 47). భారీ అంచనాల నడుమ నేడు థియేటర్లలో విడులైన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు అలరించిందో రివ్యూలో చూద్దాం.

కథేంటంటే..
చిట్టిబాబు (వెంకటేశ్‌) ఓ సాధారణ ప్రైవేటు ఉద్యోగి. భార్య స్వర్ణ (శ్రీనిధి శెట్టి) చిట్టీల వ్యాపారంతో అప్పులపాలవుతుంటుంది. పిల్లల అనారోగ్య సమస్యలు, కుటుంబ ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న చిట్టిబాబుకు ఉన్న ఉద్యోగం కూడా పోతుంది. ఈ కష్టాల సమయంలో అతనికి అకస్మాత్తుగా రూ. 100 కోట్ల లాటరీ తగులుతుంది. ఆ డబ్బు చేతికి రాకముందే లగ్జరీ విల్లాకు షిఫ్ట్ అయిన ఆ కుటుంబం ఊహించని ప్రమాదంలో చిక్కుకుంటుంది.

ధనికుల ఇళ్లలో పనిమనుషులుగా చేరి, ఆపై హత్యలు చేసి డబ్బు కాజేసే ఒక ప్రమాదకర బిహారీ గ్యాంగ్ చిట్టిబాబు కుటుంబాన్ని టార్గెట్ చేస్తుంది. మరి ఆ వంద కోట్ల లాటరీ వెనుక అసలు నిజం ఏంటి? ఆ బిహారీ గ్యాంగ్ బారి నుంచి తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి చిట్టిబాబు ఏం చేశాడు? ఈ కేసును ఎస్పీ (నారా రోహిత్) ఎలా డీల్ చేశాడు? అనేదే అసలు కథ.

విశ్లేషణ..
ట్రైలర్‌తోనే సినిమాపై అంచనాలను పెంచిన త్రివిక్రమ్.. ఈసారి పూర్తిగా కుటుంబ బంధాలకే పరిమితం కాకుండా, దానికి ఓ క్రైమ్ థ్రిల్లర్ టచ్ ఇచ్చి కొత్త ప్రయోగం చేశారు. సినిమా చూస్తున్నంతసేపు ‘దృశ్యం’ ఛాయలు, క్రైమ్ ఎపిసోడ్స్ గుర్తుకొస్తాయి.

ఫస్టాఫ్..
పూర్తిగా త్రివిక్రమ్ మార్క్ కామెడీ, పంచ్ డైలాగ్స్, సరదా సన్నివేశాలతో సాగిపోతుంది. సత్య కామెడీ నవ్వులు పూయిస్తుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ కథను పూర్తిగా మలుపు తిప్పి సెకండాఫ్‌పై భారీ ఆసక్తిని క్రియేట్ చేస్తుంది.

సెకండాఫ్..
మొదటి భాగంతో పోలిస్తే కొద్దిగా నెమ్మదిగా సాగినప్పటికీ, క్రైమ్ ఎపిసోడ్స్, యాక్షన్ బ్లాక్స్, అక్కడక్కడా వచ్చే ఫ్యామిలీ ఎమోషన్స్ సినిమాను నిలబెడతాయి. క్లైమాక్స్ ముందు వచ్చే చివరి 15 నిమిషాలు ఉత్కంఠభరితంగా సాగుతాయి. కథలో సరికొత్తదనం ఆశించకుండా, ఒక మంచి క్రైమ్ థ్రిల్లర్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను చూడాలనుకునేవారికి ఈ సినిమా చక్కటి అనుభూతిని ఇస్తుంది.

  • నటీనటులు..
  • మిడిల్‌ క్లాస్ వ్య‌క్తిగా, ఫ్యామిలీ మ్యాన్‌గా వెంకటేష్ తన మార్క్ యాక్టింగ్‌తో మరోసారి అదరగొట్టేశారు. కామెడీతో పాటు యాక్షన్ సీన్లలోనూ ఆయన అద్భుతంగా నటించారు.
  • హీరో భార్యగా శ్రీనిధి శెట్టి లుక్పరంగానే కాకుండా, నటన పరంగానూ ఆకట్టుకున్నారు.
  • కమెడియన్ సత్య థియేటర్లలో నవ్వుల వర్షం కురిపించాడు. ఈ సినిమాకు సత్య కామెడీ పెద్ద అసెట్.
  • నారా రోహిత్ పోలీస్ ఆఫీసర్‌గా తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు. మిగతా నటీనటులు తమ పరిధి మేరకు నటించారు.
  • సాంకేతికత..
  • థమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప‌ర్వాలేదు అనిపించింది. బీజీఎంతో సీన్లను ఎలివేట్ చేశాడు.
  • రవి కె. చంద్రన్ సినిమాటోగ్రఫీ రిచ్‌గా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా రిచ్‌గా, ఉన్నతంగా ఉన్నాయి. ఎడిటింగ్ షార్ప్‌గానే ఉంది. త్రివిక్రమ్ డైలాగ్స్ మరోసారి ప్రేక్షకులను అలరించాయి.

కుటుంబ కథా చిత్రాలకు క్రైమ్, యాక్షన్ ఎలిమెంట్స్ జోడించి తెరకెక్కించిన ఒక కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘ఆదర్శ కుటుంబం’. వెంకీ కామెడీ, త్రివిక్రమ్ మార్క్ మాటలు, ఆసక్తికరమైన క్రైమ్ థ్రిల్లింగ్ ఎపిసోడ్స్ కోరుకునే ప్రేక్షకులు ఈ వారాంతంలో ఈ సినిమాను ధైర్యంగా చూడవచ్చు.

రేటింగ్ : 2.5/5

Join WhatsApp

Join Now

Leave a Comment