2027లో పాదయాత్ర.. కీలక ప్రకటన చేసిన వైఎస్ జగన్

2027లో పాదయాత్ర.. కీలక ప్రకటన చేసిన వైఎస్ జగన్

Summarize with AI

వైసీపీ (YSR Congress Party) అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) తన పాదయాత్రపై(Padayatra) కీలక ప్రకటన చేశారు. తాడేప‌ల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాల‌యంలో ప‌ర్చూరు నియోజ‌క‌వ‌ర్గ క్యాడ‌ర్‌తో(Parchur Constituency Cadre) స‌మావేశ‌మైన జ‌గ‌న్‌.. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు(Local Body Elections), కూటమి ప్రభుత్వంపై పోరాటం(Coalition Government Fight), పార్టీ శ్రేణులు అనుసరించాల్సిన వ్యూహంపై క్యాడ‌ర్‌కు దిశానిర్దేశం చేశారు. 2027 సెప్టెంబర్‌ లేదా అక్టోబర్‌లో త‌న పాద‌యాత్ర మొద‌ల‌వుతుంద‌ని మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్ ప్ర‌క‌టించారు.

స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయో లేదో కూడా చెప్పలేని పరిస్థితి ఉందని జగన్ అన్నారు. బీసీలకు (BCs) 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెబుతూ చంద్రబాబు ప్రభుత్వం (Chandrababu Government) డ్రామా చేస్తోందని ఆరోపించారు. రిజర్వేషన్ల అంశం న్యాయస్థానంలో నిలబడదని తెలిసే.. దానిని సాకుగా చూపి స్థానిక ఎన్నికలను వాయిదా వేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని జగన్ అనుమానం వ్య‌క్తం చేశారు.

అదే సమయంలో ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (SIR) కార్యక్రమాన్ని ప్రస్తావిస్తూ.. 44 లక్షల ఓట్లు గల్లంతయ్యాయని ప్రభుత్వ వర్గాలే చెబుతున్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో స్థానిక ఎన్నికలు సజావుగా జరుగుతాయా? అని ప్రశ్నించారు.

ఎన్నికలు ఎప్పుడు జరిగినా గట్టిగా పోరాడాలి
చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ఎన్నికలు సాఫీగా జరిగే అవకాశం లేదని జగన్ వ్యాఖ్యానించారు. తనను లేదా పార్టీని ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు, అరెస్టులు, జైలు వంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. రోజుకో డ్రామా, రోజుకో నటన, డైవర్షన్‌ పాలిటిక్స్‌తో(Diversion Politics) ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు. అయితే ఎన్నికలు ఎప్పుడు, ఎలా జరిగినా ప్రజలకు వైసీపీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఎన్నికలు స్వేచ్ఛగా, సజావుగా జరిగితే వైసీపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేసిన జగన్.. అలా జరగని పరిస్థితి వచ్చినా పార్టీ శ్రేణులు గట్టిగా నిలబడి పోరాడాలని పిలుపునిచ్చారు.

జరగబోయేది కురుక్షేత్ర సంగ్రామం
రాబోయే స్థానిక ఎన్నికలను జగన్ ‘కురుక్షేత్ర సంగ్రామం’గా(Kurukshetra Battle) అభివర్ణించారు. స్థానిక ఎన్నికల్లో అధికార దుర్వినియోగం, పోలీసు బలగాల వినియోగం వంటి పరిణామాలు చోటుచేసుకుంటే.. వాటిపై ప్రజల్లో ఏర్పడే అసంతృప్తి భవిష్యత్తు సాధారణ ఎన్నికల్లో కనిపిస్తుందని అన్నారు. స్థానిక ఎన్నికలు ప్రధానంగా కార్యకర్తల ఎన్నికలని, ప్రజలకు కార్యకర్తలు అండగా నిలబడాలని, కార్యకర్తలకు పార్టీ అండగా ఉండాలని సూచించారు. దౌర్జన్యంతో ఎప్పటికీ పాలకులు రాజ్యం చేయలేరని వ్యాఖ్యానించారు.

నంద్యాల ఉపఎన్నికను గుర్తుచేసిన జగన్
తన గత పాదయాత్రకు ముందు జరిగిన నంద్యాల ఉపఎన్నికను (Nandyal By-Election) జగన్ ప్రస్తావించారు. 2017లో జరిగిన ఆ ఉపఎన్నికలో తీవ్ర అధికార దుర్వినియోగం కారణంగా వైసీపీ సుమారు 35 వేల ఓట్ల తేడాతో ఓడిపోయిందని చెప్పారు. 2014–19 మధ్య కాలంలో తమ పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలను టీడీపీలోకి తీసుకున్నారని గుర్తుచేశారు. ఆ తర్వాత తాను పాదయాత్ర చేపట్టగా ప్రజల్లో భారీ స్పందన వచ్చిందని, 2019 ఎన్నికల్లో ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారని జగన్ చెప్పారు.

2027లో పాదయాత్రపై క్లారిటీ
ఇదే సందర్భంలో తన తదుపరి పాదయాత్రపై జగన్ స్పష్టత ఇచ్చారు. 2027 సెప్టెంబర్‌ (September 2027) లేదా అక్టోబర్‌లో (October 2027) పాదయాత్ర ప్రారంభిస్తానని తెలిపారు. దీంతో జగన్ పాదయాత్ర ప్రకటన వైసీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపగా.. వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచే పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసే దిశగా ఆయన వ్యూహం ఉండొచ్చనే చర్చ మొదలైంది.

స్థానిక ఎన్నికల్లో కార్యకర్తలు గట్టిగా నిలబడాలని పిలుపునిచ్చిన జగన్.. భవిష్యత్తు రాజకీయ పోరాటానికి ఇప్పటి నుంచే సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment