పోలీసుల (Police) తీరుపై ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) హైకోర్టు (High Court) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గుంటూరులో(Guntur) పదో తరగతి (10th Class) బాలిక (Girl Student) అదృశ్యం కేసు (Missing Case)విచారణ సందర్భంగా పోలీసుల పనితీరుపై అసహనం వ్యక్తం చేసింది. బాలిక అదృశ్యమై సుమారు 80 రోజులు గడిచినా ఆచూకీ కనుగొనలేకపోవడంపై పోలీసులను, చంద్రబాబు ప్రభుత్వాన్ని హైకోర్టు ధర్మాసనం నిలదీసింది. నిన్న విచారణ సందర్భంగా బాలికను ఇవాళ తమ ముందు హాజరుపరచాలని డీజీపీని (DGP) ఆదేశించినప్పటికీ.. పోలీసులు బాలికను కోర్టు ముందు హాజరుపరచలేకపోయారు.
బాలికను కోర్టు ముందు హాజరుపరచలేకపోవడంపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ‘‘డీజీపీకి మేము ఇచ్చిన ఆదేశాలు అర్థమవుతున్నాయా లేదా?’’ అని ధర్మాసనం ప్రశ్నించింది. బాలిక ఆచూకీ కోసం ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఏర్పాటు చేశామని ప్రభుత్వం (Government) కోర్టుకు తెలిపింది.
అయితే SIT ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని హైకోర్టు ప్రశ్నించింది. బాలిక ఆచూకీ కనుగొనడంలో విఫలమైన అధికారులను SITలో చేర్చడం వల్ల ప్రయోజనం ఏమిటని హైకోర్టు ప్రశ్నించింది. మొత్తం తొమ్మిది మంది అధికారులతో SIT ఏర్పాటు చేయగా.. అందులో ఏడుగురు ఇప్పటికే బాలిక ఆచూకీ కనుగొనడంలో విఫలమైన అధికారులేనని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.
‘‘పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో(Police Department) ఎవరి పని వాళ్లు సక్రమంగా చేస్తే ప్రజలు కోర్టును ఎందుకు ఆశ్రయిస్తారు?’’ అని హైకోర్టు ప్రశ్నించింది. పోలీసులు సక్రమంగా పనిచేయకపోవడం వల్లే బాధితులు కోర్టును ఆశ్రయించాల్సి వస్తోందని వ్యాఖ్యానించింది. బాలిక ఆచూకీ కోసం మరికొంత సమయం కావాలని ప్రభుత్వం కోర్టును కోరింది. సోమవారం నాటికి అదృశ్యమైన బాలికను హైకోర్టు ముందు హాజరుపరుస్తామని ప్రభుత్వం తెలిపింది. దీంతో సోమవారం డీజీపీ స్వయంగా కోర్టుకు హాజరు కావాలని ధర్మాసనం ఆదేశించింది.
బాలిక అదృశ్యమై 80 రోజులు దాటినా ఆచూకీ కనుగొనలేకపోవడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గుంటూరు పట్టాభిపురం పోలీసులు బాలిక ఆచూకీని కనుగొనడంలో విఫలమయ్యారని భావించే పరిస్థితి ఉందా? అని ప్రభుత్వాన్ని నిలదీసింది. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని, కంటి తుడుపు చర్యలకు పాల్పడవద్దని పోలీసులను గట్టిగా హెచ్చరించింది.
అసలు బాలిక పరిస్థితి ఏమిటి? ఆమె సురక్షితంగా ఉందా? అనే ప్రశ్నలకు తల్లిదండ్రులకు ప్రభుత్వం, పోలీసులు ఏం సమాధానం చెబుతారని హైకోర్టు నిలదీసింది. సోమవారం విచారణలో ప్రభుత్వం, పోలీసు శాఖ ఎలాంటి వివరాలు సమర్పిస్తుందన్నది కీలకంగా మారింది.








కొండా సురేఖ బర్తరఫ్‌పై స్పందించిన బీఆర్ఎస్