రాష్ట్రంలో ఏ రాజకీయ నేత పుట్టినరోజు వేడుకలైనా సాధారణంగా ఫ్లెక్సీలు, కేక్ కటింగ్స్‌తో ముగుస్తాయి. కానీ, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) పుట్టినరోజు వేడుకల (Birthday Celebrations) పేరుతో ఆయన అభిమానులు, జనసేన కార్యకర్తలు (Jana Sena Workers) చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల జనసేన శ్రేణులు హద్దులు మీరి వ్యవహరించిన తీరు సామాన్య ప్రజలను, ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. అభిమానం ఉండొచ్చు కానీ, అది ఇతరులకు ఇబ్బందికరంగా మారితే ఎలాగనే ప్రశ్న ఇప్పుడు సర్వత్రా వ్యక్తమవుతోంది.
దేవాలయాల సాక్షిగా.. దారుణ ప్రవర్తన
నెల్లూరు జిల్లాలో(Nellore District) జనసేన నేతల అత్యుత్సాహం తారస్థాయికి చేరింది. ఏకంగా ఆదిదేవుడైన వినాయకుడి ఆలయంలో పవన్ కల్యాణ్ భారీ కటౌట్‌ను(Cutout) ఏర్పాటు చేసి పూజలు నిర్వహించారు. రాజకీయ నాయకుడి పుట్టినరోజు ప్రచారం కోసం పవిత్ర దేవాలయాన్ని వేదికగా మార్చడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
“సనాతన ధర్మం (Sanatana Dharma) గురించి, సంప్రదాయాల పరిరక్షణ గురించి నిత్యం బోధనలు చేసే పవన్ కల్యాణ్.. ఆయన పార్టీ నేతలు దేవుడి గుడిలోనే కటౌట్లు పెట్టి పూజలు చేయడం ఏంటి? ఇదేనా మీరు పాటించే సనాతన ధర్మం?” అంటూ నెల్లూరు వాసులు నిలదీస్తున్నారు. హిందువుల మనోభావాలు కించపరిచేలా జనసైనికుల ప్రవర్తన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
ఆర్టీసీ బస్సులపై ఎక్కి విన్సెంట్లు
తాడేపల్లిగూడెంలో జనసేన అభిమానుల అత్యుత్సాహం మరింత శృతిమించింది. ఏకంగా ఆర్టీసీ బస్సు పైకప్పు పైకి ఎక్కి జనసేన జెండాలను ప్రదర్శించారు. ప్రయాణికుల ప్రాణాలను, భద్రతను గాలికొదిలేసి బస్సు ఎక్కి హంగామా చేయడం, బైక్ సైలెన్సర్ల తీసేసి స్టంట్లు చేస్తూ స్థానికులకు తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు.
ఏపీలో జనసైనికుల వీరంగం
— Telugu Feed (@Telugufeedsite) September 3, 2026
తాడేపల్లిగూడెంలో నడిరోడ్డుపై బస్సు ఆపి ప్రయాణికులకు ఇబ్బందులకు గురిచేస్తూ విన్యాసాలు
బైకులతో స్టంట్లు, ఆర్టీసీ బస్సు ఎక్కి డ్యాన్సులు, జెండా ప్రదర్శనలు
పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా రోడ్లపై హల్చల్ చేసిన జనసైనికులు pic.twitter.com/54tz1KqiGn
మరోవైపు విశాఖపట్నం, విజయవాడ పరిసర ప్రాంతాలు, ఇతర జిల్లాల్లోనూ ఇదే తంతు కొనసాగింది. నడిరోడ్డుపై డీజేల హోరు, బైక్‌ల సైలెన్సర్లు తొలగించి భారీ శబ్దాలతో ర్యాలీలు నిర్వహించారు. గుంపులుగా రోడ్లపైకి వచ్చి ట్రాఫిక్‌ను స్తంభింపజేయడంతో వృద్ధులు, రోగులు, సాధారణ ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు.
మౌనంగా ఉన్న ప్రభుత్వం?
ప్రతిపక్షాల చిన్నచిన్న తప్పులకే చట్టాలను క్రూరంగా ప్రయోగించే కూటమి ప్రభుత్వంలో.. అధికార పార్టీ నేతలు, అభిమానులు చేస్తున్న ఈ ‘అరాచక’ వేడుకలపై మాత్రం పోలీసులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సినిమా డైలాగులతో ప్రత్యర్థులపై విరుచుకుపడే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. తన పార్టీ శ్రేణులు చేస్తున్న ఈ దుశ్చర్యలపై ఎందుకు పెదవి విప్పడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
కేవలం ఉపన్యాసాలు ఇవ్వడమే కాకుండా, ముందుగా తన పార్టీ కార్యకర్తలను, అభిమానులను అదుపులో ఉంచాలని.. ప్రజాశాంతికి భంగం కలిగించే ఇలాంటి చర్యలను కఠినంగా అణచివేయాలని కోరుతున్నారు. అభిమానం హద్దుల్లో ఉంటేనే ఆనందం.. అదే అదుపు తప్పితే అరాచకం అవుతుందని ఇప్పటికైనా నాయకులు గ్రహించాలని ప్రజలు హెచ్చరిస్తున్నారు.








కొండా సురేఖ బర్తరఫ్‌పై స్పందించిన బీఆర్ఎస్