అమరావతి (Amaravati) ప్రాంతంలో ఒక్కసారిగా రాజకీయ సెగలు రాజుకున్నాయి. ఉండవల్లి గ్రామంలో (Undavalli Village) తీవ్ర ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. బలవంతపు భూసేకరణకు (Forced Land Acquisition) వ్యతిరేకంగా పోరాడుతున్న పెనుమాక రైతులకు (Penumaka Farmers) మద్దతుగా క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లిన వైసీపీ(YSRCP) బృందం, సీఆర్డీయే రైతు పరిరక్షణ కమిటీ (CRDA Farmers Protection Committee) నేతలపై టీడీపీ(TDP) శ్రేణులు ఒక్కసారిగా దాడికి తెగబడ్డాయి. రాళ్లు, కర్రలు, కోడిగుడ్లతో జరిపిన ఈ దాడిలో పలు వాహనాలు పూర్తిగా ధ్వంసమవగా.. భద్రతగా ఉన్న పోలీసులకు, ఒక కానిస్టేబుల్‌కు (Constable) తీవ్ర గాయాలయ్యాయి.
అసలేం జరిగిందంటే..?
అమరావతి పరిధిలోని పెనుమాక ప్రాంతంలో తమ భూములను బలవంతంగా సేకరించడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారంటూ, కొన్ని రోజులుగా స్థానిక రైతులు ఉద్యమిస్తున్నారు. భూములు ఇవ్వని తమపై ప్రభుత్వం, అధికారులు రకరకాలుగా వేధింపులకు (Harassment) దిగుతున్నారని.. తమ భూముల చుట్టూ మట్టి తవ్వేసి, వ్యవసాయం కూడా చేసుకోనివ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో, తమకు జరుగుతున్న అన్యాయాన్ని, క్షేత్రస్థాయిలో తాము ఎదుర్కొంటున్న పరిస్థితులను పరిశీలించాల్సిందిగా పెనుమాక రైతులు వైసీపీ నేతలను, రైతు పరిరక్షణ కమిటీని ఆహ్వానించారు. రైతుల పిలుపు మేరకు శనివారం వైసీపీ ప్రతినిధుల బృందం, సీఆర్డీయే రైతు పరిరక్షణ కమిటీ సభ్యులు సదరు వివాదాస్పద భూములను పరిశీలించడానికి బయలుదేరారు.
వైసీపీ బృందం(YSRCP Team), రైతులు కలిసి ఉండవల్లి గ్రామానికి చేరుకోగానే అక్కడ అప్పటికే మోహరించిన టీడీపీ కార్యకర్తలు వారిని అడ్డుకున్నారు. అమరావతికి అనుకూలంగా నిర్ణయం తీసుకున్న తర్వాతే ఇక్కడికి రావాలంటూ నినాదాలు చేస్తూ వైసీపీ నేతల కాన్వాయ్‌పైకి దూసుకొచ్చారు. చూస్తుండగానే పరిస్థితి అదుపు తప్పింది. టీడీపీ శ్రేణులు రాళ్లు, కర్రలు, కోడిగుడ్లతో వైసీపీ నేతల వాహనాలపై విరుచుకుపడ్డారు. ఈ ఆకస్మిక దాడిలో వైసీపీ నాయకులు, ఎమ్మెల్సీలకు సంబంధించిన పలు కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి.
ఉండవల్లిలో పోలీసుల సమక్షంలోనే వైసీపీ శ్రేణులపై రాళ్లతో దాడికి దిగిన టీడీపీ కార్యకర్త pic.twitter.com/DOwVMYwyTi
— Telugu Feed (@Telugufeedsite) June 27, 2026
పోలీసులపై దాడి.. కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలు
ఘర్షణను నివారించడానికి వచ్చిన పోలీసులపై (Police) కూడా దాడి జరిగింది. టీడీపీ నాయకులు రాళ్లు విసరడంతో విధుల్లో ఉన్న ఒక పోలీస్ కానిస్టేబుల్ తలకు తీవ్ర గాయమైంది. రక్తసిక్తమైన సదరు కానిస్టేబుల్‌తో పాటు గాయపడిన మరికొంతమందిని పోలీసులు హుటాహుటిన చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. రైతుల సమస్యలు తెలుసుకోవడానికి వస్తే ఇలా భౌతిక దాడులకు తెగబడటం ప్రజాస్వామ్య విరుద్ధమని వైఎస్సార్‌సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా, స్థానికంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది.








