ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని (Ram Pothineni) హీరోగా నటిస్తూ స్వయంగా దర్శకత్వం (Direction) వహిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం #RAPO23 గురించి సోషల్ మీడియాలో (Social Media)ఒక క్రేజీ అప్డేట్ వైరల్ అవుతోంది. పాండిచ్చేరిలో(Pondicherry) జరిగిన తాజా షెడ్యూల్లో రామ్ పోతినేని చూపించిన డెడికేషన్(Dedication) చిత్ర యూనిట్‌తో పాటు అభిమానులను కూడా ఆశ్చర్యపరిచింది. ఈ షెడ్యూల్లో రామ్ పోతినేని నటనతో పాటు దర్శకత్వ బాధ్యతలను నిర్వర్తిస్తూ, ఏకధాటిగా ఏకంగా 24 గంటల పాటు షూటింగ్‌ను (Shooting) పూర్తి చేసి అందరినీ విస్మయానికి గురిచేశారు.
ఒక భారీ సెటప్‌లో దాదాపు 9 రోజుల పాటు కీలక సన్నివేశాల చిత్రీకరణను చిత్ర బృందం చేపట్టింది. పాండిచ్చేరిలో కురిసిన భారీ వర్షాల కారణంగా షూటింగ్‌కు స్వల్ప అంతరాయం కలగడంతో ఈ షెడ్యూల్‌ను తాత్కాలికంగా ముగించారు. మిగిలిన కీలక సన్నివేశాలను పూర్తి చేయడానికి చిత్ర బృందం త్వరలోనే తిరిగి పాండిచ్చేరి వెళ్లనుంది. నటుడిగా(Actor), దర్శకుడిగా(Director) రెండు కీలక బాధ్యతలను భుజాన వేసుకుని రామ్ చేస్తున్న ఈ హార్డ్‌వర్క్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేస్తోంది.








