ఆక్వా ఫీడ్ ధరలు తగ్గించకపోతే ఆందోళనే..

ఆక్వా ఫీడ్ ధరలు తగ్గించకపోతే ఆందోళనే..

ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) దారుణంగా పెరిగిన ఆక్వా ఫీడ్‌ ధరలను (Aqua Feed Prices) ఈ నెలాఖరులోగా తగ్గించకపోతే, జూలై 1 లేదా 2వ తేదీల్లో ఆక్వా రైతులతో (Aqua Farmers) కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని వైసీపీ(YSRCP) అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (YS Jagan Mohan Reddy) కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మంగళవారం తాడేపల్లిలోని (Tadepalli) పార్టీ కేంద్ర కార్యాలయంలో వివిధ జిల్లాల నుంచి వచ్చిన ఆక్వా రైతులు, ఏపీ ప్రాన్ ఫెడరేషన్ (AP Prawn Federation) ప్రతినిధులు వైఎస్ జగన్‌ను కలసి తమ స‌మ‌స్య‌లు చెప్పుకున్నారు. రైతుల సమస్యలు విన్న ఆయన.. ఆక్వా రంగానికి (Aqua Sector) పూర్తి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

గతంలో ఆక్వా ఫీడ్ ధరలు కొద్దిగా పెరిగితే ‘జగన్ టాక్స్’ (Jagan Tax) అంటూ దుష్ప్రచారం చేశారని వైఎస్ జగన్ మండిపడ్డారు. మరి ఇప్పుడు కిలో ఫీడ్‌పై ఏకంగా రూ.16 వరకు పెంచారని, ఇప్పుడేం టాక్స్ పడిందో చెప్పాలని నిలదీశారు. “ఇది సీబీఎన్ టాక్సా(CBN Tax)? లేక లోకేష్ టాక్సా(Lokesh Tax)? ఆక్వా సీడ్, ఫీడ్, ప్రాసెసింగ్ కంపెనీలన్నీ చంద్రబాబుకు అత్యంత సన్నిహితులైన ఒకే వర్గం చేతుల్లో ఉన్నాయి. వారంతా సిండికేట్‌గా మారి రైతులను దారుణంగా దోచుకుంటున్నారు అని మాజీ సీఎం వైఎస్ జగన్ అన్నారు.

వైసీపీ హయాంలో ఆక్వా రైతులకు ఇచ్చిన మాట ప్రకారం యూనిట్ (Unit) విద్యుత్‌ను రూ.1.50కే అందించామని, ఇందుకోసం 57 నెలల్లో రూ.3,306 కోట్ల సబ్సిడీ ఇచ్చామని జగన్ గుర్తుచేశారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం ‘జీఓ ఆర్‌టీ: 169’(GO RT: 169) తెచ్చి పవర్ ఫ్యాక్టర్ (PF) నిబంధనల పేరుతో ఆక్వా మోటార్లకు (Aqua Motors) సబ్సిడీ (Subsidy) కట్ చేసే కుట్ర చేస్తోందని ఆరోపించారు. వైసీపీ హయాంలో సీఎం ఛైర్మన్‌గా ‘అప్సడా'(APSADA)ను ఏర్పాటు చేసి సిండికేట్ దోపిడీని అడ్డుకున్నామని, రేట్లు పెంచిన కంపెనీలపై చట్టపరమైన చర్యలు తీసుకున్నామని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిందని విమర్శించారు.

ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో రొయ్యల ధరలు తగ్గడం, మరోవైపు ఉత్పత్తి వ్యయం, ఫీడ్ ధరలు పెరగడంతో ఆక్వా రైతులు తీవ్ర నష్టాల్లో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆక్వా వర్సిటీ (Aqua University) నిర్మాణాన్ని కూడా కూటమి ప్రభుత్వం గాలికొదిలేసిందన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి వెంటనే ఆక్వా ఫీడ్ ధరలను తగ్గించాలని, లేనిపక్షంలో ఆక్వా రైతుల సమస్యను దేశవ్యాప్తంగా ఎలుగెత్తి చాటేలా ఉద్యమిస్తామని వైఎస్ జగన్ స్పష్టం చేశారు

Join WhatsApp

Join Now

Leave a Comment