జనసేన పార్టీకి చెందిన రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ (Arava Sridhar) తనను మోసం చేశారంటూ బాధితురాలు హర్ష వీణ (Harsha Veena) మరోసారి సోషల్ మీడియా వేదికగా సంచలన వీడియో విడుదల చేశారు. తనకు జరిగిన అన్యాయంపై జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)ను ఆమె నేరుగా ప్రశ్నించారు. ఈ వీడియోలో హర్ష వీణ అత్యంత ఆవేదనతో మాట్లాడుతూ.. “నేను అన్యాయమైపోయానని మూడు నెలలుగా మొత్తుకుంటున్నాను. మీ కమిటీ ఇంకా నివేదిక ఇవ్వలేదంటేనే అర్థమవుతోంది.. మీ వైపు తప్పు ఉందని! మీరంతా కలిసి నన్ను సక్సెస్ ఫుల్‌గా మోసం చేశారు” అని ఆరోపించారు.
పార్టీలో సామాన్యుడైనా, పవన్ కళ్యాణ్ అయినా ఒక్కటే అని చెప్పే మాటలు ఎక్కడికి పోయాయని ఆమె ప్రశ్నించారు. “రేపు మీ కుటుంబాల్లో ఇలాగే జరిగితే మా పార్టీ వాడే కదా అని ముడుచుకుని కూర్చుంటారా? అమ్మాయిలను రేప్ చేసినా సరే వదిలేస్తారా?” అంటూ తీవ్ర స్థాయిలో నిలదీశారు.
ప్రధాన ఆరోపణలు..
మూడు నెలలు గడుస్తున్నా పార్టీ వేసిన విచారణ కమిటీ నివేదిక బయట పెట్టకపోవడాన్ని ఆమె తప్పుపట్టారు. తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న అరవ శ్రీధర్ దర్జాగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని తనకు అన్యాయం చేయాలని చూస్తే, మంగళగిరిలోని (Mangalagiri) జనసేన రాష్ట్ర కార్యాలయం (Jana Sena Party State Office) ముందే పెట్రోల్ (Petrol) పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించారు.
ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై హర్ష వీణ సంచలన ఆరోపణలు చేశారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని, బలవంతంగా అబార్షన్లు చేయించారని ఆమె ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే జనసేన పార్టీ ముగ్గురు సభ్యులతో (టి. శివశంకర్ (T. Shivashankar), తంబళ్లపల్లి రమాదేవి (Tamballapalli Ramadevi), టి.సి. వరుణ్ (T.C. Varun) విచారణ కమిటీని నియమించింది. నివేదిక వచ్చే వరకు శ్రీధర్‌ను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశించినప్పటికీ, ఆయన మళ్ళీ కనిపిస్తుండటంతో బాధితురాలు ఆందోళనకు దిగారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై జనసేన అధిష్ఠానం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.
ఇంకెందుకు మీ పార్టీ.. సిద్ధాంతాలు ఉన్నాయా..?
— Telugu Feed (@Telugufeedsite) March 27, 2026
మరో వీడియో విడుదల చేసిన @JanaSenaParty ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలు వీణ
ఆధారాలు అన్నీ బయట పెట్టినా.. ఏం చేస్తావో చేసుకో అని వెటకారంగా మాట్లాడుతున్నారు
పార్టీ నుంచి సస్పెండ్ అయిన వ్యక్తి పవన్ మీటింగులో ఎలా పాల్గొన్నారు… https://t.co/ExGUgY50fq pic.twitter.com/FISIChQwWN








