వీఐపీల సేవ‌లో అధికారులు.. సామాన్య భక్తులకు ఇక్కట్లు

వీఐపీల సేవ‌లో అధికారులు.. సామాన్య భక్తులకు ఇక్కట్లు

Summarize with AI

విజయవాడ ఇంద్రకీలాద్రిపై సామాన్య భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు. శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి దర్శనం కోసం భక్తులు భారీగా తరలిరావడంతో దుర్గమ్మ దర్శనానికి మూడు గంటలకు పైగా సమయం పడుతోంది. మరోవైపు విఐపీల పేరుతో అనధికార వ్యక్తులు ఓం టర్నింగ్ నుంచి ఇంద్రకీలాద్రిపైకి చేరుకుంటుండటంతో సాధారణ భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

విఐపీల పేరుతో వస్తున్న వారితో చిన రాజగోపురం వద్ద రద్దీ పెరిగి, సామాన్య భక్తులు బారులు తీరాల్సిన పరిస్థితి ఏర్పడింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ ఓం టర్నింగ్ వద్దకు చేరుకున్నారు. మెయిన్ గేటు నుంచి అడ్డగోలుగా వ్యక్తులను ఎలా అనుమతిస్తున్నారంటూ పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

అనంతరం గేటుకు తాళాలు వేయించి, అనుమతి ఉన్నవారిని మాత్రమే లోపలికి పంపేలా చర్యలు చేపట్టారు. విఐపీల పేరుతో అనధికార వ్యక్తుల రాకను నియంత్రించడంతో పాటు, సామాన్య భక్తులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

Join WhatsApp

Join Now

Leave a Comment