జ‌గ‌న్ తెచ్చిన మ‌రో వ్య‌వ‌స్థ పేరు మార్పు – సీఎం ప్రకటన

జ‌గ‌న్ తెచ్చిన మ‌రో వ్య‌వ‌స్థ పేరు మార్పునకు నిర్ణయం

Summarize with AI

గ్రామ (Village), వార్డు (Ward) సచివాలయాల (Secretariats) వ్యవస్థకు పేరు (Name) మారుస్తున్నట్లు (Changed) కూటమి ప్రభుత్వం (Coalition Government) నిర్ణయం తీసుకోవడం, స్వ‌యంగా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబే (Chandrababu) ఈ నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించ‌డం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. 2019 అక్టోబర్‌ 2న మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (YS Jaganmohan Reddy) గ్రామ స్వరాజ్య స్ఫూర్తితో గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను ఆవిష్కరించారు. ఈ వ్యవస్థ ద్వారా ప్రజలకు పాలనను ద‌గ్గ‌ర చేశారు. సచివాలయాల ద్వారా 1.30 లక్షల శాశ్వత ఉద్యోగాలు, 2.60 లక్షల వలంటీర్‌లకు ఉపాధి కల్పించారు.

విజన్ యూనిట్స్‌గా పేరు
అధికారంలోకి వ‌చ్చాక వలంటీర్ (Volunteer) వ్యవస్థను రద్దు చేసిన చంద్రబాబు ప్రభుత్వం తాజాగా గ్రామ సచివాలయాల పేరును “విజన్ యూనిట్స్‌” (Vision Units)గా మార్చుతున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయాన్ని మంత్రులు, అధికారులతో సమీక్షా సమావేశంలో సీఎం చంద్రబాబు వెల్లడించారు. అయితే ఈ నిర్ణయం వెనుక రాజకీయ దురుద్దేశ్యం ఉందని వైసీపీ తీవ్రంగా విమర్శిస్తోంది. వైఎస్‌ జగన్ రూపకల్పన చేసిన గ్రామ స‌చివాల‌య‌ వ్యవస్థ పేరు మార్చి చంద్ర‌బాబు తన క్రెడిట్‌లోకి వేసుకునే ప్రయత్నం చేస్తున్నారని వైసీపీ తీవ్రంగా ఆక్షేపిస్తోంది.

కూటమి పేరు మార్చిన పథకాలు, వ్యవస్థలు

జగన్ తెచ్చిన అమ్మఒడి పథకం – తల్లికి వందనం అయ్యింది. రైతు భరోసా – అన్నదాత సుఖీభవ అయ్యింది. వాహన మిత్ర – ఆటో డ్రైవర్ల సేవలో అని, వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకాన్ని – చంద్రన్న మత్స్యకార భరోసా అయ్యింది. వైఎస్సార్ ఆరోగ్య శ్రీ – ఎన్టీఆర్ వైద్య సేవగా మార్చారు. తాజా జగన్ తెచ్చిన మరో విప్లవాత్మక వ్యవస్థ గ్రామ, వార్డు సచివాలయాలకు కూడా పేరు మార్చి అవన్నీ తన క్రెడిట్ లో వేసుకోవాలని చంద్రబాబు తాపత్రయపడుతున్నాడని వైసీపీ శ్రేణులు మండిపడుతున్నారు.

జ‌గ‌న్ పేరు చెర‌పాల‌నే కుట్రా..?
దేశంలో ఎక్కడా లేని ఈ వ్యవస్థ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే వైఎస్‌ జగన్ నేతృత్వంలో రూపుదిద్దుకుంది. “వైఎస్‌ జగన్ విజన్‌”గా నిలిచిన ఈ వ్యవస్థకు ఇప్పుడు “విజన్ యూనిట్‌” అని పేరు పెట్టడం వెనుక ఉద్దేశ్యం స్పష్టంగా ఉందని వైసీపీ నేతలు అంటున్నారు. ప్రజల్లో వైఎస్‌ జగన్ సృష్టించిన గుర్తింపును చెరపాలనే కుట్రలో చంద్రబాబు ఉన్నారని వారు ఆరోపిస్తున్నారు. వైఎస్‌ జగన్ కాలంలో ప్రభుత్వ రంగంలో లక్షా 30 వేలకుపైగా ఉద్యోగాలను కల్పించిన సచివాలయ వ్యవస్థకు పేరు మార్చడం అంటే ప్రజల మనసుల్లో ఉన్న ఆ గుర్తింపును తొల‌గించాల‌నే కుట్ర జ‌రుగుతోందంటూ వైసీపీ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment