సీబీఐకి సవీంద్రారెడ్డి అక్రమ అరెస్ట్ కేసు.. ఏపీ హైకోర్టు కీల‌క నిర్ణ‌యం

సీబీఐకి సవీంద్రారెడ్డి అక్రమ అరెస్ట్ కేసు.. ఏపీ హైకోర్టు కీల‌క నిర్ణ‌యం

వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ కుంచల సవీంద్ర రెడ్డి (Kunchala Savindra Reddy) అక్రమ అరెస్ట్ కేసులో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)హైకోర్టు (High Court) కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసు విచారణను సీబీఐ(CBI)కి అప్పగిస్తూ, వచ్చే నెల 13వ తేదీ లోపు దర్యాప్తు నివేదిక సమర్పించాలని ఆదేశించింది. హైకోర్టు స్పష్టం చేస్తూ, పోలీసులు ఈ కేసులో కోర్టును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని, అందువల్లే సీబీఐ సుమోటోగా స్వీకరించి విచారణ చేయాలని ఆదేశించింది.

సవీంద్రరెడ్డి లాయర్ వివరాల ప్రకారం.. పోలీసులు కోర్టులో సవీంద్రరెడ్డిని సాయంత్రం 7:30కు అరెస్ట్ చేశామని తెలిపారు. కానీ, నిందితుడు తాను 6:30కే అరెస్టయ్యానని వాదిస్తున్నాడు. కన్ఫెషన్ రిపోర్టులో 7:30కు అరెస్ట్ చేశామని రాసిన పోలీసులు, రిమాండ్ రిపోర్టులో మాత్రం 8:30కు అరెస్ట్ చేశామని పేర్కొన్నారు. ప్రత్తిపాడు పోలీసులు అరెస్టు చేశామని చెప్పినా, లాలాపేట ఎస్ హెచ్ ఓ శివప్రసాద్ (S.H.O .Shivaprasad) అరెస్ట్ చేసినట్లు సాక్ష్యాలు స్పష్టంగా చూపుతున్నాయి. అంతేకాదు, సాయంత్రం 7 గంటలకు సవీంద్రరెడ్డి సతీమణి పోలీస్ స్టేషన్‌కు వచ్చినట్లు సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డు ఉంది. ఈ విభిన్నతలన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు, కేసు దర్యాప్తును పూర్తిగా సీబీఐకి అప్పగించింది అని స‌వీంద్రరెడ్డి త‌ర‌ఫు లాయ‌ర్లు తెలిపారు. ఈ పరిణామంతో సవీంద్రరెడ్డి అరెస్ట్ కేసు మరింత ఆసక్తికర మలుపు తిరిగింది.

Join WhatsApp

Join Now

Leave a Comment