“ఇకపై మీ ముందు రష్మిక మందన్న దేవరకొండగా..”

"ఇకపై మీ ముందు రష్మిక మందన్న దేవరకొండగా.."

అచ్చంపేట గ‌డ్డ‌పై ‘ది దేవరకొండ ఫౌండేషన్’(The Deverakonda Foundation) సామాజిక సేవా విప్లవానికి నాంది పలికింది. విద్యార్థుల‌కు (Students) స్కాల‌ర్‌షిప్‌ల (Scholarships) అంద‌జేత కార్యక్రమంలో పాల్గొన్న త‌న భ‌ర్త విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో (Vijay Deverakonda) పాటు స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న (Rashmika Mandanna) పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా విద్యార్థులను ఉద్దేశించి చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకోవడమే కాకుండా, వేదికపై ఆమె తన పేరును మార్చి పలకడం అక్కడికి వచ్చిన అభిమానులను మురిపించింది.

“ఈ రోజు ఫస్ట్ టైమ్ ‘ది దేవరకొండ ఫౌండేషన్’ ద్వారా స్కాలర్‌షిప్స్ స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు.. డెఫినెట్లీ మా మావయ్య ఊరైన అచ్చంపేట నుంచే ప్రారంభించాలని ఇక్కడికి వచ్చాం. ఈ రోజు మీ అందరి ముందు నేను ‘రష్మిక మందన్న దేవరకొండ’గా (Rashmika Mandanna Deverakonda) మాట్లాడుతున్నాను” అని ప్రకటించడంతో సభాప్రాంగణం మొత్తం చప్పట్లతో మారుమోగిపోయింది.

“9వ, 10వ తరగతుల్లో ఫస్ట్, సెకండ్ ర్యాంకులు సాధించిన విద్యార్థులారా.. మీ వయసులో నేను ఎక్కడున్నానో, మీరు ఇప్పటికే దానికంటే చాలా ముందున్నారు. యు గైస్ ఆర్ ఆల్రెడీ అచీవర్స్. చాలా హార్డ్ వర్క్ చేసి మీ తల్లిదండ్రులు గర్వపడేలా చేశారు. మీ అందరికీ కంగ్రాచులేషన్స్. లైఫ్ లో కొన్నిసార్లు గెలుస్తాం, కొన్నిసార్లు ఓడిపోతాం. కానీ ప్రతిసారీ ఏదో ఒకటి నేర్చుకుంటాం. మీరంతా మీ పేరెంట్స్ ను రెస్పెక్ట్ చేస్తూ, టీచర్స్ నుంచి నేర్చుకుంటూ జీవితంలో చాలా పెద్ద స్థాయికి ఎదగాలి అని ర‌ష్మిక విద్యార్థుల‌ను మోటివేట్ చేశారు.

“జీవితంలో పెద్ద పెద్ద లక్ష్యాలను (Ambition) పెట్టుకోండి. క్రమశిక్షణ (Discipline), ఫోకస్ తో కష్టపడండి. అదే సమయంలో మీ హెల్త్ కూడా జాగ్రత్తగా చూసుకుంటూ ఎప్పుడూ నవ్వుతూ, హ్యాపీగా ఉండండి” అంటూ ర‌ష్మిక విద్యార్థుల‌కు ఆల్ ది బెస్ట్ చెప్పింది.

Join WhatsApp

Join Now

Leave a Comment