ఓట్ల తొల‌గింపుపై పరకాల ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు

ఓట్ల తొల‌గింపుపై పరకాల ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు

దేశంలో ప్రస్తుతం జరుగుతున్న స్పెషల్ ఇంటిగ్రేటెడ్ రివిజన్ (SIR) లేదా ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియపై (Voters Special Comprehensive Revision Process) ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, కేంద్ర ఆర్థిక మంత్రి భర్త డాక్టర్ పరకాల ప్రభాకర్ (Dr. Parakala Prabhakar) తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. నెల్లూరులో (Nellore) జరిగిన ఒక అవగాహన సదస్సులో పాల్గొన్న ఆయన, ఈ ఓటర్ల సవరణ ప్రక్రియను ప్రజాస్వామ్య హక్కులకు గొడ్డలిపెట్టుగా అభివర్ణించారు. దేశ రాజకీయ సమాజం నుంచి కొన్ని కోట్ల మందిని శాశ్వతంగా దూరం చేసేందుకు ఈ ప్రక్రియ సాగుతోందని ఆయన ఆరోపించారు.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా సాగుతున్న ఈ ఓటర్ల తొలగింపు ప్రక్రియపై (Voter Deletion Process) పరకాల ప్రభాకర్ సంచలన గణాంకాలను బయటపెట్టారు. దేశవ్యాప్తంగా ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో కలిపి సుమారు 6.5 కోట్ల మంది ఓటర్లను జాబితా నుంచి తొలగించారని చెప్పారు. ఈ సవరణ ప్రక్రియ పూర్తిగా ముగిసే సమయానికి దేశంలో దాదాపు 16.50 కోట్ల మంది తమ ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం పొంచి ఉందని ఆయన హెచ్చరించారు.

కేవలం డూప్లికేట్ ఓటర్లను(Duplicate Voters), చనిపోయిన వారి ఓట్లను మాత్రమే తొలగిస్తున్నారని ప్రచారం చేయడం కేవలం ఒక అపోహ మాత్రమేనని ఆయన కొట్టిపారేశారు. “కొన్ని సామాజిక వర్గాలను టార్గెట్ చేస్తూ, వారిని దేశ రాజకీయ ప్రక్రియలో పాల్గొనే పాత్ర, అర్హత లేకుండా వేరు చేయడమే ఈ SIR అసలు ఉద్దేశంలా కనిపిస్తోందని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

ఎన్నికల సంఘం (ECI) ప్రతీ ఏటా అక్టోబర్ నుంచి జనవరి మధ్య నిర్వహించే వార్షిక సవరణ (SSR) ప్రక్రియపై తనకే నమ్మకం లేనట్టుగా వ్యవహరిస్తోందని పరకాల ప్రభాకర్ విమర్శించారు. బీహార్(Bihar), తమిళనాడు(Tamil Nadu), ప‌శ్చిమ బెంగాల్‌ (West Bengal) వంటి రాష్ట్రాల్లో లక్షలాది ఓట్లను తొలగించారని, తీరా సుప్రీంకోర్టు (Supreme Court) ఆదేశాల తర్వాత కూడా ఏ కేటగిరీ కింద ఆ ఓట్లను తొలగించారో స్పష్టమైన సమాచారం ఇవ్వలేకపోయారని గుర్తుచేశారు. కొన్ని నిర్దిష్ట సామాజిక వర్గాల ఓట్లను తొలగించడం ద్వారా దేశ భవిష్యత్తును మార్చే కుట్ర జరుగుతోందని ఆయన పౌర సమాజాన్ని హెచ్చరించారు. ఈ ప్రక్రియపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండి తమ ఓటును సరిచూసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

Join WhatsApp

Join Now

Leave a Comment