ట్రంప్ వ్యాఖ్య‌ల‌కు జెలెన్‌స్కీ స్ట్రాంగ్ కౌంట‌ర్‌

ట్రంప్ వ్యాఖ్య‌ల‌కు జెలెన్‌స్కీ స్ట్రాంగ్ కౌంట‌ర్‌

Summarize with AI

రష్యాతో యుద్ధంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ (Volodymyr Zelenskyy) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్‌లో శాంతి నెలకొంటుందంటే, తాను అధ్యక్ష పదవిని వదులుకునేందుకు కూడా సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు. అయితే, ఉక్రెయిన్‌కు నాటో (NATO)లో సభ్యత్వం కల్పించాల్సిందేనని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.

జెలెన్‌స్కీ నియంత అని తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. “నేను నియంతను కాదు.. నా దేశ భద్రతే నా మొదటి కర్తవ్యం” అని స్పష్టం చేశారు. ఎన్నికలు జరగకపోవడానికి ప్రధాన కారణం యుద్ధ పరిస్థితులే అని వివరించారు.

అమెరికా-ఉక్రెయిన్ ఒప్పందాలు
అమెరికా-ఉక్రెయిన్‌ల మధ్య ఖనిజ నిక్షేపాల ఒప్పందంపై కూడా జెలెన్‌స్కీ మాట్లాడారు. ఈ ప్రక్రియ ముందుకు సాగుతోందని, సహజ వనరులను పంచుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. “పుతిన్ మళ్లీ దాడి చేయకుండా నిలువరించగలిగే శక్తిమంతమైన అమెరికా నాయకత్వం” అవసరమని ఆయన అన్నారు. యుద్ధానికి ముగింపు పలికేందుకు ప్రపంచ నేతలు ఉక్రెయిన్‌లో చర్చలకు వస్తున్నారని, ఇది కీలక మలుపుగా నిలుస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఏ శాంతి చర్చలలోనైనా ఉక్రెయిన్ భాగస్వామ్యం తప్పనిసరి అని స్పష్టం చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment