శ్రీకాళహస్తిలో టీడీపీ దౌర్జన్యం.. సర్పంచ్ అభ్యర్థిపై దాడి

శ్రీకాళహస్తిలో టీడీపీ దౌర్జన్యం.. సర్పంచ్ అభ్యర్థిపై దాడి

Summarize with AI

తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తొట్టంబేడు మండలంలో వైసీపీ మద్దతుదారులను నామినేషన్లు దాఖలు చేయకుండా టీడీపీ శ్రేణులు అడ్డుకొని దాడులు తెగ‌బ‌డ్డారు. టీడీపీ విచ‌క్ష‌ణార‌హితంగా దాడులు చేస్తున్న‌ వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

తొట్టంబేడు మండలంలోని 27 గ్రామ పంచాయతీల్లో వైసీపీ మద్దతుతో ఒక్క అభ్యర్థి కూడా నామినేషన్ వేయకుండా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆ పార్టీ నేతలు విమర్శిస్తున్నారు.

తొట్టంబేడు మండలం రౌతుసూరిమాల గ్రామానికి చెందిన వైసీపీ మద్దతుదారు, సర్పంచ్ అభ్యర్థి నాగరాజు నామినేషన్ దాఖలు చేసేందుకు వెళ్తుండగా టీడీపీ నేతలు అడ్డుకుని దాడి చేశారు. నాగరాజు వద్ద ఉన్న నామినేషన్ పత్రాలను చింపివేయడంతో పాటు ఆయన తలపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు.

దాడిలో తలకు గాయాలైన నాగరాజును చికిత్స నిమిత్తం శ్రీకాళహస్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు వెళ్తున్న అభ్యర్థులపై దాడులు చేయడం, నామినేషన్ పత్రాలను చింపివేయడం ప్రజాస్వామ్య ప్రక్రియకు విఘాతం కలిగించడమేనని వైసీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

తొట్టంబేడు మండలంలో నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని, అభ్యర్థులకు రక్షణ కల్పించాలని కోరుతున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment