జమ్మూలో లష్కరే ఉగ్రవాది ఎన్‌కౌంటర్

జమ్మూలో లష్కరే ఉగ్రవాది ఎన్‌కౌంటర్

Summarize with AI

జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్‌లో భద్రతా బలగాలు లష్కరే తోయిబా ఉగ్రవాది లతీఫ్ భట్‌ను ఎన్‌కౌంటర్‌లో హతమార్చినట్లు వెల్లడైంది. మరో ఉగ్రవాదిని పోలీసులు చుట్టుముట్టినట్లు తెలుస్తోంది. సైన్యం, స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ సహకారంతో ఆ ప్రాంతాన్ని పూర్తిగా దిగ్బంధించి గాలింపు చర్యలు చేపట్టారు.

నవంబర్ 11న కుల్గామ్ జిల్లా మీర్ బజార్ సమీపంలోని సీఆర్పీఎఫ్ పోస్టుపై జరిగిన దాడిలో లతీఫ్ భట్ పాల్గొన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ దాడిలో ముగ్గురు సీఆర్పీఎఫ్ జవాన్లు గాయపడ్డారు. గతంలో అనంత్‌నాగ్‌లో పోలీస్ కానిస్టేబుల్ హత్య, కుల్గామ్‌లో వలస కార్మికుల హత్యల్లోనూ లతీఫ్ భట్ ప్రమేయం ఉన్నట్లు పేర్కొంటున్నారు. కుల్గామ్ దాడి అనంతరం కిష్త్‌వార్‌లో ఇద్దరు స్పెషల్ పోలీస్ అధికారుల హత్యలు చోటుచేసుకోవడంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment