“చంద్ర‌బాబు టీమ్‌కు అభినంద‌న‌లు” – జగన్ సంచలన ట్వీట్

"చంద్ర‌బాబు టీమ్‌కు అభినంద‌న‌లు" - జగన్ సంచలన ట్వీట్

Summarize with AI

ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై వైసీపీ అధినేత‌, మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్ సంచ‌ల‌న ట్వీట్ చేశారు. నామినేషన్‌ల ఘట్టం నుంచి కౌంటింగ్ ప్రక్రియ వరకు ప్రతి దశలోనూ ప్రజాస్వామ్యాన్ని పాత‌రేస్తూ కూట‌మి సాగించిన ఈ ‘సెలక్షన్ల భాగోతం’పై ఎక్స్ వేదికగా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

చంద్రబాబు గూండారాజ్ పాలనకు, వారికి పూర్తిస్థాయిలో కొమ్ముకాసిన పోలీస్ వ్యవస్థకు, పక్షపాతంతో వ్యవహరించిన రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC)కి శుభాకాంక్ష‌లు చెబుతూ జ‌గ‌న్ చేసిన సెటైరిక‌ల్ ట్వీట్ ఏపీ రాజకీయాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

“చంద్ర‌బాబు టీమ్ అయిన పోలీసులకు, రాష్ట్ర ఎన్నికల సంఘానికి అభినంద‌న‌లు. ప్రతిపక్షానికి అసలు పోటీ చేసే అవకాశం కూడా లేకుండా చేసి, ఎన్నికల్లో ఎలా గెలవాలో మీరు మరోసారి నిరూపించారు” అంటూ సెటైర్లు పేల్చారు.

ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పటి నుంచి ఓట్ల లెక్కింపు ముగిసే వరకు అధికార దుర్వినియోగానికి పాల్పడిన తీరును వైఎస్ జగన్ వరుస పాయింట్లతో ఎండగట్టారు.

  • నామినేషన్ల వేసేందుకు వచ్చిన వైసీపీ అభ్యర్థులను భయాందోళనలకు గురిచేసి నామినేషన్ల దశను హైజాక్ చేశారు.
  • ఆపై స్క్రూటినీ ప్రక్రియను, బలవంతపు నామినేషన్ల ఉపసంహరణనూ కూటమికి అనుకూలంగా మార్చుకున్నారు.
  • బూత్‌లలో ప్రతిపక్ష పోలింగ్ ఏజెంట్లను తీవ్రంగా బెదిరించి, బలవంతంగా బయటకు పంపించారు.
  • పోలింగ్‌ను అక్రమాలకు వేదికగా మార్చి, చివరకు పోలింగ్ శాతాన్ని సైతం తమకు అనుకూలంగా తారుమారు చేశారు.
  • చివ‌ర‌కు కౌంటింగ్ ప్రక్రియను సైతం హైజాక్ చేశారు.

ప్రజలు తమ నాయకులను తామే స్వయంగా ఎన్నుకునే అవకాశం లేకుండా చేసి, చంద్రబాబే తమ అభ్యర్థులను ఎంపిక చేసుకున్నారు. “ఇవి ప్రజలు ఎన్నుకున్న ఎన్నికలు కావు.. మీరు ఎంపిక చేసిన అభ్యర్థుల ఎన్నికలుగా మార్చేశారు. ఇవి అసలు ఎలక్షన్లు కావు.. కేవలం టీడీపీ సెలక్షన్లు మాత్రమే” అని ధ్వజమెత్తారు.

Join WhatsApp

Join Now

Leave a Comment