“గెలిచినా వెళ్లగొట్టారు.. మీదొక బతుకేనా?”

"గెలిచినా వెళ్లగొట్టారు.. మీదొక బతుకేనా?"

Summarize with AI

ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో వైసీపీ ఆధిక్యంలో కొన‌సాగింది. కుప్పం మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద తీవ్ర ఉద్రిక్తత, హైటెన్షన్ వాతావరణం నెలకొంది. కౌంటింగ్‌లో వైసీపీ అభ్యర్థులు ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. దీన్ని జీర్ణించుకోలేని అధికార పార్టీ నాయకులు వైసీపీ అభ్యర్థులను కౌంటింగ్ కేంద్రం నుంచి బలవంతంగా బయటకు తరిమేయ‌డం తీవ్ర సంచలనం రేపింది.

కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని 3, 7, 8 వార్డులలో వైసీపీ అభ్యర్థులు స్పష్టమైన మెజార్టీతో విజయం దిశగా దూసుకెళ్తున్న తరుణంలోనే ఈ అరాచకానికి తెరదీశారు. 3వ వార్డులో వైసీపీ అభ్యర్థి ఏకంగా 250 ఓట్ల ఆధిక్యంతో విజయం ఖాయం చేసుకునే స్థాయికి చేరుకున్నారు. 7వ వార్డు అభ్యర్థి మనోహర్, 8వ వార్డు అభ్యర్థి గెలుపు ముంగిట నిలవడంతో టీడీపీ నేత‌లు దౌర్జ‌న్యానికి పాల్ప‌డ్డారు.

తమ అధినేత చంద్రబాబు సొంత అడ్డాలోనే వైసీపీ అభ్యర్థులు గెలిస్తే రాజకీయంగా ముఖం చెల్లకుండాపోతుందన్న నైతిక ఓటమి భయంతో కౌంటింగ్ కేంద్రంలోనే పచ్చ నేతలు అభ్యర్థులపై దాడికి తెగబడ్డారు.

కౌంటింగ్ కేంద్రం నుంచి పోలీసులు, టీడీపీ శ్రేణులు బలవంతంగా వెళ్లగొట్టడంతో బయటకు వచ్చిన వైసీపీ అభ్యర్థులు, వారి కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతూ మీడియా ముందు కూటమి ప్రభుత్వంపై, అధికారుల కొమ్ముకాసే వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

“నేను ఎన్నికల్లో స్పష్టమైన ఆధిక్యంతో గెలిచాను. కానీ నా గెలుపును అధికారికంగా ప్రకటించకుండా నన్ను బయటకు తోసేశారు. కుప్పం మున్సిపల్ కమిషనర్ పక్షపాతంతో తెలుగుదేశం పార్టీ ఏజెంట్‌లా వ్యవహరిస్తున్నారు. మీకు నిజంగా దమ్ము, ధైర్యం ఉంటే, మీరు మగాళ్లయితే ఒంటరిగా, పారదర్శకంగా పోటీ చేసి గెలవండి అంటూ చంద్రబాబు, లోకేష్‌లకు సవాల్ చేశారు.

సొంత నియోజకవర్గంలో వైసీపీ గెలుపును జీర్ణించుకోలేక దౌర్జన్యాలతో విజయాన్ని లాక్కునేందుకు చంద్రబాబు దిగజారి ప్రవర్తిస్తున్నారని వైసీపీ నేత‌లు విమర్శించారు. కుప్పంలో జరిగిన ఈ అక్రమాలపై ఉన్నత స్థాయి విచారణ జరిపించి, గెలిచిన తమ అభ్యర్థుల విజయాన్ని తక్షణమే ప్రకటించాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment