నందికొట్కూరు మున్సిపాలిటీ వైసీపీ కైవసం

నందికొట్కూరు మున్సిపాలిటీలో వైఎస్సార్‌సీపీ హవా.. 23కి పైగా వార్డుల్లో విజయం!

Summarize with AI

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) మున్సిపల్ ఎన్నికల (Municipal Elections) ఫలితాల్లో నంద్యాల (Nandyal) జిల్లాలో వైసీపీ (YSRCP)ఆధిక్యం కనబరుస్తోంది. ముఖ్యంగా నందికొట్కూరు మున్సిపాలిటీలో(Nandikotkur Municipality) వైసీపీ ఘన విజయం సాధించింది. మొత్తం 32 వార్డులకు గాను 23కి పైగా వార్డుల్లో పార్టీ అభ్యర్థులు విజయం సాధించినట్లు ఫలితాలు వెల్లడిస్తున్నాయి. ఈ ఫలితాలతో వైసీపీ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి. పార్టీ నాయకులు, కార్యకర్తలు టపాసులు కాల్చి, మిఠాయిలు పంచుకుంటూ సంబరాలు చేసుకుంటున్నారు.

మరోవైపు నంద్యాల జిల్లాలోని బేతంచర్ల (Bethamcherla) నగర పంచాయతీలోనూ వైసీపీ ఆధిక్యం కొనసాగుతోంది. తొలి రౌండ్ కౌంటింగ్ ముగిసే సమయానికి మొత్తం 28 వార్డులకు గాను 18 వార్డుల్లో వైసీపీ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నట్లు సమాచారం. దీంతో బేతంచర్లలోనూ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం కనిపిస్తోంది. తుది ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతోంది.

బైరెడ్డి సిద్ధార్థ్‌రెడ్డి వ్యూహం

నందికొట్కూరు నియోజకవర్గంలో(Nandikotkur Constituency) మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థ్‌రెడ్డి (Byreddy Siddharth Reddy) చురుగ్గా పాల్గొన్నారు. స్థానిక నాయకులు, పార్టీ కేడర్‌తో సమన్వయం చేసుకుంటూ ఎన్నికల ప్రచారంలో కీలక పాత్ర పోషించారు. ఈ నేపథ్యంలో నందికొట్కూరు మున్సిపాలిటీలో వెలువడుతున్న ఫలితాలు పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. ఈ విజయాన్ని బైరెడ్డి సిద్ధార్థ్‌రెడ్డి రాజకీయ వ్యూహానికి దక్కిన ఫలితంగా పార్టీ నాయకులు అభివర్ణిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment