యూట్యూబర్ అనుమానాస్పద మృతి

యూట్యూబర్ అనుమానాస్పద మృతి

Summarize with AI

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో (Andhra Pradesh యువ యూట్యూబర్ (YouTuber), సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ (Influencer) అనుమానాస్ప‌ద స్థితిలో మృతిచెందిన సంఘ‌ట‌న సంచ‌ల‌నం సృష్టిస్తోంది. ఎన్టీఆర్ జిల్లా (NTR District) లోని ఏ.కొండూరు గ్రామానికి చెందిన వెంపాటి మధుమిత (Vempati Madhumitha) (22) అనుమానాస్పద పరిస్థితుల్లో మృతిచెందింది (Died).. విస్సన్నపేట మండలంలోని తెల్లదేవరపల్లి గ్రామానికి చెందిన బొల్లిపోగు ప్రతాప్ (Bollipogu Pratap) అనే వ్యక్తి తన కూతురిని (మధుమితను) గత రాత్రి బయటకు తీసుకెళ్లి ఉరి వేసి (Hanged) చంపాడని ఆమె తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది సాధారణ మృతి కాదని, ఈ మ‌ధుమితది ముమ్మాటికీ హత్య అని, త‌న కుమార్తెను హ‌త్య చేసి ఆత్మ‌హ‌త్య‌గా చిత్రీక‌రించే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని, దీని వెనుక కుట్ర ఉందని వారు ఆరోపిస్తున్నారు.

మధుమిత మృతిపై పూర్తి దర్యాప్తు చేపట్టాలని, బొల్లిపోగు ప్రతాప్‌తో పాటు అతని కుటుంబ సభ్యులపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని మృతురాలి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే మధుమిత మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Join WhatsApp

Join Now

Leave a Comment