నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి జరిగిన అసెంబ్లీ ఎన్నికలు నేటితో పూర్తయ్యాయి. ఈ ఎన్నికల్లో రికార్డ్ స్థాయి ఓటింగ్ నమోదైంది. అస్సాం, కేరళం, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, పుదచ్చేరిలో ఎవరు గెలుస్తారా? అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మే 04న తుది ఫలితాలు రాబోతున్నాయి. అస్సాం, కేరళ, పుదుచ్చేరిలలో ఏప్రిల్ 9న పోలింగ్ జరగ్గా, తమిళనాడులో కూడా ఏప్రిల్ 23న ఒకే దశలో పోలింగ్ నిర్వహించారు. బెంగాల్‌లో రెండు దశల్లో మొదటి దశ ఏప్రిల్ 23న జరిగింది. రెండో దశ బుధవారం(ఏప్రిల్29)న జరిగింది. వెస్ట్ బెంగాల్‌లో 294, అస్సాంలో 126, తమిళనాడులో 234, కేరళలో 140, పుదుచ్చేరిలో 30 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగాయి.
ఇదిలా ఉంటే, దేశవ్యాప్తంగా ఇప్పుడు అందరి చూపు పశ్చిమ బెంగాల్, తమిళనాడు ఫలితాలపై ఉన్నాయి. ముఖ్యంగా బెంగాల్‌లో మరోసారి దీదీ అధికారంలోకి వస్తుందా? లేక బీజేపీ మమతా బెనర్జీ కోటను బద్ధలు కొడుతుందా? అనే దాన్ని ఎగ్జిట్ పోల్స్ సూచిస్తున్నాయి. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం, ఈ సారి బెంగాల్‌లో బీజేపీ అధికారంలోకి వస్తుందని సూచిస్తున్నాయి. మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ బీజేపీకి జై కొట్టగా, ఒకటి రెండూ టీఎంసీ మళ్లీ అధికారంలోకి వస్తుందని అంచనా వేశాయి.








