కిమ్ కర్దాషియాన్‌ను దాటిన కోహ్లీ

కిమ్ కర్దాషియాన్‌ను దాటిన కోహ్లీ

Summarize with AI

విరాట్ కోహ్లి (Virat Kohli) మైదానంలోనే కాదు, సోషల్ మీడియాలోనూ తన ప్రభావాన్ని మరోసారి చాటుకున్నారు. తాజాగా ఎక్స్‌ (ట్విట్ట‌ర్)లో(X) అత్యధిక మంది ఫాలోవర్లు (Followers) కలిగిన ప్రపంచ ప్రముఖుల జాబితాలో 11వ స్థానానికి చేరుకున్నారు. ఈ క్రమంలో అమెరికన్ మీడియా పర్సనాలిటీ(American Media Personality) కిమ్ కర్దాషియాన్‌ను (Kim Kardashian) అధిగమించడం విశేషం.

ప్రస్తుతం విరాట్ కోహ్లికి ఎక్స్‌లో 69.9 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. దీంతో 69.7 మిలియన్ల ఫాలోవర్లు కలిగిన కిమ్ కర్దాషియాన్‌ను ఆయన వెనక్కి నెట్టారు. ప్రపంచవ్యాప్తంగా క్రీడాకారుడిగా మాత్రమే కాకుండా, సోషల్ మీడియాలోనూ కోహ్లి ప్రభావం ఎంతగానో పెరుగుతున్నట్లు ఈ గణాంకాలు చెబుతున్నాయి.

ఇక ఈ జాబితాలో ఎలాన్ మస్క్ (Elon Musk) 240 మిలియన్లకు పైగా ఫాలోవర్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, భారత ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) 106.9 మిలియన్ల ఫాలోవర్లతో ఐదో స్థానంలో ఉన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment