నాని ‘ది ప్యారడైజ్’ రిలీజ్ డేట్ ఫిక్స్..

నాని ‘ది ప్యారడైజ్’ రిలీజ్ డేట్ ఫిక్స్..

నేచురల్ స్టార్ నాని హీరోగా, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ది ప్యారడైజ్’ రిలీజ్ డేట్ దాదాపు ఖరారైనట్లు సమాచారం. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాను మొదట ఆగస్టు 21న విడుదల చేయాలని భావించినప్పటికీ, షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తికాకపోవడంతో వాయిదా పడింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ విషయాన్ని ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లకు తెలియజేసి రిలీజ్ ఏర్పాట్లు ప్రారంభించాలని సూచించినట్లు సమాచారం.

అలాగే, సినిమా విడుదలకు ఒక రోజు ముందు అంటే సెప్టెంబర్ 24న భారీ స్థాయిలో ప్రీమియర్ షోలు నిర్వహించేందుకు కూడా ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా కొనసాగుతుండగా, అన్నీ అనుకున్న సమయానికి పూర్తైతే ప్రకటించిన తేదీకే సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌తో భారీ అంచనాలు సొంతం చేసుకున్న ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనం సృష్టిస్తుందోనని నాని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment