విరాట్ కోహ్లీ (Virat Kohli) టెస్టు క్రికెట్‌లోకి (Test Cricket)తిరిగి వస్తారన్న ప్రచారానికి స్వయంగా ఆయన చెక్ పెట్టారు. ఇటీవల సోషల్ మీడియాలో, క్రికెట్ వర్గాల్లో కోహ్లీ మళ్లీ టెస్టు జట్టులోకి రీ ఎంట్రీ ఇవ్వొచ్చన్న వార్తలు జోరుగా వినిపించాయి. అయితే ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసిన కోహ్లీ, తన టెస్టు కెరీర్ ఇప్పటికే ముగిసిందని పేర్కొన్నట్లు సమాచారం.
టెస్టు ఫార్మాట్‌కు వీడ్కోలు (Retirement) చెప్పిన తర్వాత కూడా అభిమానులు(Fans) ఆయన పునరాగమనంపై ఆశలు పెట్టుకున్నప్పటికీ, తాజా రిప్లై తో ఆ ఊహాగానాలకు తెరపడింది. మరోవైపు అంతర్జాతీయ క్రికెట్‌లో (International Cricket) తన ప్రయాణాన్ని కొనసాగిస్తానని విరాట్ కోహ్లీ స్పష్టం చేశారు. ముఖ్యంగా వన్డే ఫార్మాట్‌పై (ODI – One Day International) పూర్తిగా దృష్టి సారించనున్నట్లు వెల్లడించినట్లు తెలుస్తోంది.
భారత జట్టుకు ఎన్నో చారిత్రాత్మక విజయాలు అందించిన కోహ్లీ, టెస్టు క్రికెట్‌లో అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లలో ఒకరిగా గుర్తింపు పొందారు. అయినప్పటికీ భవిష్యత్తులో వన్డే క్రికెట్‌లోనే తన అనుభవాన్ని జట్టుకు ఉపయోగపడేలా చేస్తానన్న సంకేతాలు ఇచ్చినట్లు క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి. కోహ్లీ తాజా వ్యాఖ్యలు అభిమానుల్లో చర్చనీయాంశంగా మారాయి.








జనసేన ఎమ్మెల్యే నోటి దురుసు.. వైసీపీ ఎమ్మెల్సీ సవాల్