టీటీడీ పీఠం.. ప‌త్రికాధిప‌తికా..? స‌న్నిహితునికా..?

టీటీడీ పీఠం.. ఈసారి ప‌త్రికాధిప‌తికా..? స‌న్నిహితునికా..?

Summarize with AI

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) (TTD) పాలకమండలి గడువు త్వరలోనే ముగియనుండటంతో, తదుపరి చైర్మన్ పీఠాన్ని (Chairman Post) దక్కించుకునేందుకు ముమ్మర కసరత్తు ప్రారంభమైంది. పవిత్రమైన తిరుమల పీఠాన్ని అధిరోహించి శ్రీవారి సేవ చేసుకునే భాగ్యం కోసం రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులు తీవ్ర స్థాయిలో పోటీ పడుతున్నారు.

కూటమి ప్రభుత్వం (Coalition Government) అధికారంలోకి వచ్చాక మీడియాధిపతి బీఆర్ నాయుడికి(BR Naidu) టీటీడీ చైర్మన్ పదవిని సీఎం చంద్రబాబు (CM Chandrababu Naidu) కట్టబెట్టారు. అయితే ఆయన హయాంలో టీటీడీ వరుస వివాదాల్లో చిక్కుకోవడం, ఆయన ఒంటెత్తు పోకడల వల్ల సంస్థ ప్రతిష్టకు భంగం కలిగిందనే అభిప్రాయం పార్టీ పెద్దల్లో వ్యక్తమైంది.

ముఖ్యంగా లేటు వ‌య‌సులో ఆయనకు సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ అయిన వ్యక్తిగత ఫొటోలు, వీడియోల వివాదం కూటమి ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది. ప్రతిపక్షాలకు ఇది బలమైన ఆయుధంగా మారడంతో, ఈ విషయంలో ప్రభుత్వం తీవ్ర అసహనానికి గురైంది.

ప్రస్తుత బోర్డు గడువు పూర్తవుతుండటంతో కొత్త పాలకమండలి నియామకానికి అమరావతి (Amaravati) స్థాయిలో ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. దేశంలోనే అత్యంత ప్రాధాన్యత కలిగిన ఈ పదవిని ఎలాగైనా దక్కించుకోవాలని పలువురు అగ్రనేతలు, ప్రముఖులు తమ వంతుగా ఎవ‌రికి తోచిన స్థాయిలో వారి పేరవీలు న‌డుపుతున్నారు.

గతంలో రిలయన్స్ పీఆర్‌ఓగా (Reliance PRO) పనిచేసిన చంద్ర‌బాబు సొంత జిల్లాకు చెందిన‌ లోకాద్రినాయుడు (శ్రీనివాస్)(Lokadri Naidu – Srinivas) పేరు ప్రచారంలో బలంగా వినిపిస్తోంది. కేంద్రంలో బీజేపీ(BJP) పెద్దలతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu Naidu) వద్ద కూడా ఉన్న సంబంధాలు ఆయనకు సానుకూలంగా మారాయి. ఇటీవల సాలకట్ల బ్రహ్మోత్సవాల సమయంలో ఆయన కుటుంబానికి తిరుమలలో దక్కిన ప్రాధాన్యత, ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు ఈ ప్రచారానికి మరింత బలాన్ని చేకూర్చాయి.

బీఆర్ నాయుడి నియామకానికి ముందు నుంచే పోటీలో ఉన్న ఒక ప్రముఖ పత్రికాధిపతి.. ఈసారి ఎలాగైనా టీటీడీ చైర్మన్ పీఠం (TTD Chairman Post) దక్కించుకోవాలని సీఎం చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం.

కావేరి ట్రావెల్స్ అధినేత(Kaveri Travels Chairman), విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు(Ganta Srinivasa Rao), సినీ నటుడు-నిర్మాత బండ్ల గణేష్‌లతో(Bandla Ganesh) పాటు కొందరు బహుళజాతి పారిశ్రామికవేత్తలు, ఆధ్యాత్మిక వేత్తలు కూడా ఈ పదవి కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.

నాయకత్వ మార్పు ద్వారా టీటీడీ ప్రతిష్టను పునరుద్ధరించాలని భావిస్తున్న టీడీపీ అధిష్టానం, ఈసారి ఎవరికి అవకాశం ఇస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఎవరికి వారు తమదైన శైలిలో లాబీయింగ్ కొనసాగిస్తున్నప్పటికీ.. తుది నిర్ణయం మాత్రం సీఎం చంద్రబాబు చేతుల్లోనే ఉంది.

Join WhatsApp

Join Now

Leave a Comment